Breaking News

జీవితంలో ఎదగాలంటే? ఓయో ఫౌండర్ 'రితేశ్ అగర్వాల్' మాటల్లో..

Published on Sat, 04/22/2023 - 19:20

'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు' అన్న మాటలు అక్షర సత్యం. అయితే జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలంటే తప్పకుండా కొంత మంది అనుభవాలు చాలా అవసరం. అవి తప్పకుండా మనిషిలో మంచి స్ఫూర్తిని నింపుతాయి. దీనికి నిదర్శనం మా అమ్మ చెప్పిన మాటలు అంటూ ఓయో సంస్థ సీఈఓ 'రితేశ్ అగర్వాల్' ఇటీవల వెల్లడించారు.

ఇటీవల ఐఐటీ నాగ్‌పూర్ గ్రాడ్యుయేషన్ వేడుకలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో కూడా ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో నా అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాలను విద్యార్థులతో పంచుకునే అవకాశం ఇప్పుడు దక్కిందని ''మీరు గొప్పస్థాయికి చేరుకునే క్రమంలో, ఉన్నత శిఖరాలను అధిరోహించే మార్గంలో మీరు మీ మూలాలు ఎప్పటికీ మర్చిపోవద్దని, జీవితంలో ఎంత పైకి ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే మాటను మా అమ్మ దగ్గర విన్నానని'' చెప్పాడు.

మీరు ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ, ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారనే సంగతి మర్చిపోకూడదని అన్నారు. జీవితంలో గొప్ప వ్యాపారాలను సాధించాలనే తపనను విడనాడకుండా ఉన్న మాదిరిగానే మీ మూలాలను ఎప్పటికి విడిచిపెట్టకూడదన్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది మీ మాటలతో ఏకీభవిస్తున్నామని.. మీ కథ అందరికీ ఆదర్శమని కామెంట్స్ పెటుతున్నారు.

(ఇదీ చదవండి: వైద్య వృత్తిలో వెయ్యికోట్లకంటే ఎక్కువ సంపాదిస్తున్న డాక్టర్ - ఈమె)

సుమారు రూ. 7,253 కోట్లకు అధిపతి అయిన ఓయో ఫౌండర్ రితేశ్ ఒడిశాలోని రాయ్‌గఢ్‌లో జన్మించాడు. కేవలం 19 సంవత్సరాల వయసులోనే హోటల్ వసతి కల్పించే ఓయో రూమ్స్‌ ప్రారభించి అతి తక్కువ కాలంలోనే విజయవంతమయ్యాడు. ప్రస్తుతం 'ఓయో'కున్న క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తక్కువ వ్యవధిలోనే భారతదేశంలో బిలియనీర్‌గా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన రితేశ్ అగర్వాల్ ఓయో సంస్థను 800 నరగరాలకు పైగా విస్తరించాడు. అంతే కాకుండా ఇప్పుడు ఆయన ఈ సంస్థను ఇతర దేశాలలో కూడా విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 1.1 బిలియన్ డాలర్లు.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)