Breaking News

ఎయిర్‌పోర్ట్‌లో రూ.10కే టీ, రూ20కే సమోసా!

Published on Thu, 01/23/2025 - 14:04

ఎయిర​్‌పోర్ట్‌లో స్నాక్స్‌ ధర రూ.వందల్లో ఉంటుందని తెలుసుకదా. అయితే కొత్తగా ప్రారంభించిన కేఫ్‌లో మాత్రం కేవలం రూ.10కే టీ, వాటర్‌ బాటిల్‌, రూ.20కే సమోసా, స్వీటు లభిస్తుంది. ‘అదేంటి.. షాపింగ్‌ మాల్స్‌లోనే వాటర్‌ బాటిల్‌ రూ.80 వరకు ఉంది. మరి ఎయిర్‌పోర్ట్‌లో ఇంత తక్కువా..?’ అని ధరలు చూసి ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ‘ఉడాన్‌ యాత్రి కేఫ్‌’ను ప్రారంభించింది. విమాన ప్రయాణికులకు చౌకగా స్నాక్స్‌ అందించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు.

కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా ప్రారంభించిన ఉడాన్ యాత్రి కేఫ్ పుణ్యమా అని సరసమైన స్నాక్స్‌ ధరలు అందుబాటులోకి వచ్చాయి. 2024 డిసెంబర్ 21న పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ కేఫ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతిరోజూ సుమారు 900 మంది ప్రయాణీకులు ఈ కేఫ్‌ సేవలు వినియోగించుకుంటున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి. దీని ఆవిష్కరణ సమయంలో మంత్రి మాట్లాడుతూ..విమానాశ్రయంలో ఆహార ధరల పెరుగుదలపై దీర్ఘకాలంగా వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: 2,000 ఐడీలను బ్లాక్‌ చేసిన రైల్వేశాఖ

ధరలిలా..

ఉడాన్ యాత్రి కేఫ్‌లో ప్రయాణికులు రూ.10కే టీ, రూ.10కే వాటర్ బాటిల్, కేవలం రూ.20కే సమోసా, రూ.20కు స్వీట్లు వంటి స్నాక్స్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ధరలు విమానాశ్రయంలోని ఇతర ఆహార దుకాణాలు వసూలు చేసే అధిక రేట్లకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రయాణీకుల నుంచి ఈ కేఫ్‌కు సానుకూల స్పందన వస్తోంది. కేఫ్ ప్రారంభించిన మొదటి నెలలో సుమారు 27,000 మంది ప్రయాణీకులకు సేవలు అందించింది. ఇతర విమానాశ్రయాల్లో ఈ నమూనా కేఫ్‌లను ప్రారంభించాలని ప్రయాణికుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)