Breaking News

రెండు లక్షలపైగా సంస్థలకు స్టార్టప్‌ గుర్తింపు

Published on Thu, 12/11/2025 - 21:23

ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా సంస్థలు స్టార్టప్‌ గుర్తింపు పొందాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది. 2,01,335 స్టార్టప్‌లను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం డీపీఐఐటీ గుర్తించినట్లు తెలిపింది. ఇవి దేశవ్యాప్తంగా 21 లక్షల పైచిలుకు ఉద్యోగాలను కల్పాయని పేర్కొంది. 2025 జూన్‌ వరకు 14 రంగాలవ్యాప్తంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద రూ. 1.88 లక్షల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయని శాఖ వివరించింది. దీనితో అదనంగా రూ. 17 లక్షల కోట్ల విలువ చేసే ఉత్పత్తి/అమ్మకాలు జరిగాయని, 12.3 లక్షల మేర ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగిందని పేర్కొంది.

పీఎల్‌ఐ స్కీముతో ఎల్రక్టానిక్స్, ఫార్మా, టెలికం, నెట్‌వర్కింగ్‌ ప్రోడక్ట్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర రంగాల నుంచి ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. స్టార్టప్‌ ఇండియా కార్యక్రమం కింద స్టార్టప్‌గా గుర్తింపు పొందిన సంస్థలకు ఆదాయ పన్ను రాయితీ తదితర ప్రోత్సాహకాలు లభిస్తాయి. మరోవైపు, వ్యాకారాల నిర్వహణను సరళతరం చేసే క్రమంలో నిబంధనల భారాన్ని కూడా గణనీయంగా తగ్గించినట్లు కేంద్రం తెలిపింది. గత 11 ఆర్థిక సంవత్సరాల్లో (2014–25) భారత్‌లోకి 748.38 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని వివరించింది. అంతక్రితం 11 ఏళ్లలో (2003–14) వచ్చిన 308.38 బిలియన్‌ డాలర్లకు ఇది 143 శాతం అధికమని పేర్కొంది.

#

Tags : 1

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)