Breaking News

ఐటీలో మళ్లీ  నియామకాల జోరు 

Published on Sun, 05/11/2025 - 05:21

ముంబై: కొంత కాలంగా స్తబ్దత కనిపించిన ఐటీ రంగంలో మళ్లీ నియామకాలు జోరందుకున్నాయి. ఏప్రిల్‌ నెలలో నియామకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 16 శాతం పెరిగినట్టు జాబ్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఫౌండిట్‌’ వెల్లడించింది. అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల (జీసీసీలు) విస్తరణ నియామకాల వృద్ధికి దోహదం చేసినట్టు తెలిపింది. 

2024–25లో జీసీసీలు కొత్తగా 1,10,000 టెక్‌ ఉద్యోగాలకు నియామకాలు చేసిన విషయాన్ని ప్రస్తావించింది. డేటా ఇంజనీరింగ్, ఎంటర్‌ప్రైజ్‌ ఆర్కిటెక్చర్‌ తదితర ఉద్యోగాలకు డిమాండ్‌ నెలకొన్నట్టు తెలిపింది. ఫౌండిట్‌ డాట్‌ ఇన్‌ సైట్‌పై నమోదైన జాబ్‌ పోస్టింగ్‌ల డేటా ఆధారంగా నెలవారీ ఈ నివేదికను ఫౌండిట్‌ విడుదల చేస్తుంటుంది. 

నైపుణ్యాలతో కూడిన ఉద్యోగ నియామకాల ఆధిపత్యం ఏప్రిల్‌లో స్పష్టంగా కనిపించింది. విద్యార్హతల కంటే కూడా ప్రత్యక్ష అనుభవానికి 62 శాతం ఐటీ కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఏఐ/ఎంఎల్, క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనలైటిక్స్‌ విభాగాల్లో ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్‌ నెలకొంది. 

ఐటీ రంగం ఉద్యోగ ప్రకటనల్లో వీటి వాటాయే 95 శాతంగా ఉండడం గమనార్హం. ఏప్రిల్‌లో నియామకాల పరంగా కోయింబత్తూర్‌లో 40 శాతం, అహ్మదాబాద్‌లో 17 శాతం, బరోడాలో 15 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. ఇక బెంగళూరులో 9 శాతం, ముంబైలో 9 శాతం, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో 7 శాతం చొప్పున నియామకాలు పెరిగాయి.   
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)