Breaking News

నవీకరించిన ఐటీఆర్‌లతో ఖజానాకు రూ.9,118 కోట్లు

Published on Mon, 03/24/2025 - 17:43

గడిచిన నాలుగేళ్లలో 90 లక్షలకు పైగా నవీకరించిన(అప్‌డేట్‌) ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు అయ్యాయి. వీటి ద్వారా కేంద్ర ఖజానాకు రూ.9,118 కోట్లు సమకూరినట్లు సోమవారం ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పన్నుదారులు స్వచ్ఛందంగా వివరాలు దాఖలు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహించినట్లు తెలిపారు. 2022లో అదనపు ఆదాయ పన్ను చెల్లించడం ద్వారా సంబంధిత మదింపు సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు నవీకరించిన ఐటీ రిటర్న్‌లు(ఐటీఆర్-యూ) దాఖలు చేసే అవకాశాన్ని ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు.

ఫైనాన్స్ బిల్లు, 2025 ద్వారా అప్‌డేటెడ్‌ రిటర్న్స్ దాఖలు చేయడానికి కాలపరిమితిని సంబంధిత మదింపు సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల వరకు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో (2024-25) ఫిబ్రవరి 28 వరకు 4.64 లక్షల అప్‌డేటెడ్‌ ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయని, అందుకు రూ.431.20 కోట్ల పన్నులు చెల్లించామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో తెలిపారు.

ఇదీ చదవండి: ఏప్రిల్‌ నుంచి కార్ల ధరలు అప్‌

ఆయన తెలిపిన వివరాల ప్రకారం..2023-24 ఆర్థిక సంవత్సరంలో 29.79 లక్షల ఐటీఆర్-యూలు దాఖలు కాగా రూ.2,947 కోట్ల అదనపు పన్నులు చెల్లించారు. 2022-23, ఏవై(అసెస్‌మెంట్‌ ఇయర్‌-మదింపు సంవత్సరం) 2021-22 సంవత్సరాల్లో వరుసగా 40.07 లక్షలు, 17.24 లక్షల అప్‌డేటెడ్‌ ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. వాటిల్లో అదనంగా రూ.3,940 కోట్లు, రూ.1,799.76 కోట్ల పన్నులు చెల్లించారు. 2021-22 నుంచి 2024-25 మధ్య కాలంలో 91.76 లక్షల ఐటీఆర్-యూలు దాఖలు కాగా, ప్రభుత్వానికి రూ.9,118 కోట్ల అదనపు పన్నులు వచ్చాయి.

#

Tags : 1

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు