Breaking News

ఆగష్టులో 27000 మంది!.. ఇలా అయితే ఎలా?

Published on Fri, 09/06/2024 - 08:56

కరోనా మహమ్మారి వ్యాపించిన తరువాత.. ఉద్యోగాలు నీటిమీద బుడగల్లా మారిపోయాయి. ఇప్పటికే లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు. 2024లో కూడా ఈ సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఆగష్టు నెలలో సుమారు 27,000 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం. ఇందులో ఇంటెల్, సిస్కో, ఐబీఎమ్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.

కంపెనీలు ఎదుర్కుంటున్న ఆర్థిక మాంద్యం.. ఉద్యోగులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. 2024లో ఇప్పటి వరకు సుమారు 422 కంపెనీలు 1.36 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి.

సెమీకండక్టర్ లీడర్.. 'ఇంటెల్' ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి 15000 ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఖర్చుల పెరుగుదల.. ఆదాయ వృద్ధి తగ్గడం వంటి కారణాల వల్ల ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సి వస్తోందని కంపెనీ సీఈఓ పాట్ గెల్సింగర్ పేర్కొన్నారు.

సిస్కో కంపెనీ సుమారు 6000 మంది ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. ఈ సంఖ్య కంపెనీ మొత్తం ఉద్యోగులలో 7శాతంగా ఉంది. కంపెనీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ మీద దృష్టిపెట్టాలని యోచిస్తోంది. ఇది కంపెనీని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి సహాయపడుతుందని సంస్థ సీఈఓ చక్ రాబిన్స్ వెల్లడించారు.

ఇదీ చదవండి: వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించిన టీచర్

ఐబీఎం కంపెనీ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను చైనా నుంచి ఉపసంహరించుకున్న తరువాత సుమారు 1000 మంది కంటే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయారు. జర్మన్ చిప్ తయారీ సంస్థ ఇన్ఫినియన్ కూడా 14000 మందిని తొలగించనున్నట్లు సమాచారం. ఇదే బాటలు డెల్, షేర్‌చాట్ వంటి దిగ్గజాలు కూడా అడుగులు వేస్తున్నాయి.

#

Tags : 1

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)