Breaking News

చాట్‌జీపీటీని బాయ్‌కాట్‌ చేసిన 25 లక్షల మంది!

Published on Wed, 03/04/2026 - 18:02

అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఓపెన్‌ఏఐ సేవలపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. చాట్‌జీపీటీని బహిష్కరించాలంటూ ప్రతిజ్ఞకు పిలుపునిచ్చిన ఒక వెబ్‌సైట్.. ఇప్పటికే సుమారు 25 లక్షల మంది వినియోగదారులు చాట్‌జీపీటీని బాయ్‌కాట్‌ చేసినట్లు పేర్కొంది.

900 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఓపెన్‌ఏఐ (OpenAI) గత వారం అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. రక్షణ శాఖ తన వర్గీకృత నెట్‌వర్క్‌లో ఏఐ మోడల్‌ను అమలు చేయడానికి అనుమతి లభించింది.

ఈ డీల్‌తో వినియోగదారుల అసంతృప్తి పెరుగుతోందని ఆ వెబ్‌సైట్ వెల్లడించింది. సంతకాల సంఖ్య, సోషల్ మీడియా షేర్లు, యాప్ వినియోగ డేటా ఆధారంగా ప్రజలు చాట్‌జీపీటీపై విశ్వాసం కోల్పోతున్నారని పేర్కొంది. “అమెరికన్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లను చాట్‌జీపీటీ నుంచి నిష్క్రమించడానికి మేము సమన్వయం చేస్తున్నాం. వినియోగదారుల చర్యల ద్వారా ఓపెన్‌ఏఐకు స్పష్టమైన సందేశం పంపవచ్చు” అని వెబ్‌సైట్ పేర్కొంది.

ఇదిలా ఉండగా, సెన్సార్‌ టవర్‌ విశ్లేషణ ప్రకారం.. పెంటగాన్‌ నుంచి తప్పుకొన్న ఆంథ్రోపిక్ (Anthropic) రూపొందించిన ‘క్లాడ్’ చాట్‌బాట్ యాప్, అమెరికాలో యాపిల్‌ యాప్‌ స్టోర్‌ చార్టుల్లో చాట్‌జీపీటీ యాప్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరినట్లు సమాచారం. అలాగే టెక్‌క్రంచ్‌ నివేదిక ప్రకారం.. గత శనివారం చాట్‌జీపీటీ మొబైల్ యాప్‌ యూఎస్‌లో అన్‌ఇన్‌స్టాల్‌ల సంఖ్య రోజుకు 295 శాతం పెరిగినట్లు వెల్లడైంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)