Breaking News

రియల్‌మీకి మరో షాక్‌: రాజీనామా చేసిన 12 మంది ఉన్నతోద్యోగులు

Published on Wed, 07/26/2023 - 11:43

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీకి మరో షాక్‌ తగలింది. కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా డజను మందికిపైగా ఉద్యోగులు రియల్‌మీ ఇండియా (Realme India) సంస్థకు రాజీనామా చేసినట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం రాజీనామా చేసిన మాజీ సీఈఓ మాధవ్ సేత్‌ (Madhav Sheth) పెట్టిన కొత్త సంస్థ హానర్ టెక్‌లో చేరేందుకే ఆ ఉద్యోగులు రియల్‌మీని వీడినట్లు సమాచారం.

రియల్‌మీ ఇండియా సంస్థకు చెందిన అత్యున్నత డైరెక్టర్లతో సహా పలువురు ఉద్యోగులు మాధవ్‌ సేత్‌ కొత్త కంపెనీ హానర్ టెక్‌లో చేరిన నేపథ్యంలో రియల్‌మీ ఇండియా సంస్థలో మరిన్ని సామూహిక రాజీనామా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

రాజీనామా చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో మాజీ సేల్స్‌ డైరెక్టర్ దీపేష్ పునమియా కూడా ఉన్నారు. ఇటీవల ఆయన హానర్ టెక్‌ కంపెనీలో అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా చేరారు. కాగా ఉద్యోగుల రాజీనామాల విషయంపై రియల్‌మీ సంస్థ నుంచి ఎంటువంటి స్పందనా లేదు. 

ఇదీ చదవండి  Best Light Weight Smart phones: బరువైన ఫోన్లతో విసిగిపోయారా? ఈ లైట్‌ వెయిట్‌ స్మార్ట్‌ ఫోన్లు ట్రై చేయండి..

ఎగుమతులకు సంబంధించిన కొత్త వెంచర్‌ను ప్రారంభించడం కోసమని మాధవ్‌ సేత్‌ జూన్‌ నెలలో రాజీనామా చేశారు. అప్పటి వరకు కంపెనీలో ఆయన ఐదేళ్లు పనిచేశారు. రియల్‌మీ కంపెనీకి వైస్‌ ప్రెసిడెంట్‌గా, రియల్‌మీ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ గ్రూప్‌నకు ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. రియల్‌మీ ఫౌండర్‌ స్కైలీతో కలిసి మాధవ్‌ సేత్‌ 2018 మేలో అధికారికంగా బ్రాండ్‌ను స్థాపించారు.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)