Breaking News

భారీ ప్రయోగాలే లక్ష్యం 

Published on Thu, 01/30/2025 - 05:58

సూళ్లూరుపేట:  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతోమంది అంతరిక్ష పితామహుల కృషి ఫలితంగా శ్రీహరికోట రాకెట్‌ కేంద్రాన్ని సొంతంగా నిర్మించుకొని, నేటికి వంద ప్రయోగాలు పూర్తిచేసి చరిత్రపుటల్లోకి ఎక్కిందని చైర్మన్‌ వి.నారాయణన్‌ అన్నారు. ఇకపై ఆకాశమే హద్దుగా భారీ ప్రయోగాలే లక్ష్యంగా పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆయన బుధవారం షార్‌లోని మీడియా సెంటర్‌లో మాట్లాడారు. 

ఇస్రో చేపట్టిన వంద ప్రయోగాల్లో పాలుపంచుకున్న అంతరిక్ష పరిశోధకులకు అభినందనలు తెలియజేశారు. రాకెట్‌ ప్రయోగాలకు సంబంధించి ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటున్నాని తెలిపారు. ఇకపై నెలకు రెండు ప్రయోగాలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. షార్‌ నుంచి సెంచరీ ప్రయోగాలు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. వందో ప్రయోగానికి తాను ఛైర్మన్‌గా ఉండడం తన అదృష్టమన్నారు. ఈ ఏడాది ప్రైవేట్‌గా పీఎస్‌ఎల్‌వీ–ఎన్‌1 పేరుతో నూతన ప్రయోగాన్ని చేపట్టనున్నామని వెల్లడించారు. 

జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌16 రాకెట్‌ ద్వారా ఇస్రో, నాసా సంయుక్తంగా నిస్సార్‌ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాయని తెలిఆపరు. ఎల్‌వీఎం–3 రాకెట్‌ ద్వారా వాణిజ్యపరమైన ప్రయోగం ఉంటుందన్నారు. ఈ ఏడాది జూన్‌ నాటికి గగన్‌యాన్‌–1 క్రూమాడ్యూల్‌ ప్రయోగాన్ని హ్యూమన్‌ రిలేటెడ్‌ లాంచింగ్‌ వెహికల్‌ (హెచ్‌ఆర్‌ఎల్‌వీ) ద్వారా చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టంచేశారు. షార్‌ కేంద్రంలో మూడో ప్రయోగ వేదికను ప్రపంచస్థాయి ప్రయోగవేదికగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబోతున్నామని వి.నారాయణన్‌ ప్రకటించారు న్యూ జనరేషన్‌ లాంచింగ్‌ వెహికల్‌(ఎన్‌జీఎల్‌వీ) ద్వారా 2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపిస్తామని వెల్లడించారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్‌ ఆఖరు నాటికి తమిళనాడులోని కులశేఖరపట్నం స్పేస్‌పోర్టు కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. డాకింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం కూడా చేయనున్నామని తెలిపారు.  
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి