Breaking News

ఫుడ్‌ సర్వీసుల మార్కెట్‌ @ 125 బిలియన్‌ డాలర్లు

Published on Sun, 11/30/2025 - 05:26

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత ఆహార సేవల మార్కెట్‌ 2030 నాటికి 125 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. అసంఘటిత రంగంతో పోలిస్తే సంఘటిత రంగం రెండు రెట్లు వృద్ధి చెందనుంది. కన్సల్టెన్సీ సంస్థ కియర్నీతో కలిసి ఆన్‌డిమాండ్‌ కనీ్వనియెన్స్‌ ప్లాట్‌ఫాం స్విగ్గీ విడుదల చేసిన ‘హౌ ఇండియా ఈట్స్‌’ వార్షిక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఫుడ్‌ సర్వీసుల విభాగం వాటా దాదాపు 1.9 శాతంగా ఉంది. చైనాలో ఇది 5 శాతంగా, బ్రెజిల్‌లో 6 శాతంగా ఉంది. 

ఈ నేపథ్యంలో దేశీయంగా ఈ విభాగం గణనీయంగా వృద్ధి చెందేందుకు అవకాశాలు ఉన్నాయి. పెరుగుతున్న ఆదాయాలు, డిజిటల్‌ వినియోగం, సౌకర్యానికి పెరుగుతున్న ప్రాధాన్యం తదితర అంశాలు ఈ సెగ్మెంట్‌ వృద్ధికి కారణంగా నిలుస్తాయి. అయితే, ఇది విస్తరిస్తున్న తీరు కొంత ఆసక్తికరంగా ఉంది. దేశీ వినియోగదారులు మరింతగా ప్రయోగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 

సగటున ఒక్కో కస్టమర్‌ నుంచి విశిష్టమైన వంటకాలకు వచ్చే ఆర్డర్లు 20 శాతం పెరగ్గా, రెస్టారెంట్లలో ఇది 30 శాతంగా ఉంది. రాత్రి వేళల్లో ఆలస్యంగా తినే ధోరణి పెరుగుతోంది. ఇలాంటి వాటిల్లో రాత్రి 11 గంటల తర్వాత పిజ్జాలు, కేక్‌లు, సాఫ్ట్‌ డ్రింక్‌లతో కూడుకున్న భోజనం ఆర్డర్లు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. ఆరోగ్యకరమైన, మెరుగైన మీల్స్‌ ఆర్డర్ల సంఖ్య మొత్తం ఆర్డర్లలో 2.3 రెట్లు పెరిగింది. ప్రధానంగా ప్రొటీన్లపై దృష్టి పెడుతూ, క్యాలరీలు, యాడెడ్‌ చక్కెరను తగ్గించుకునే ధోరణి కనిపిస్తోంది. 

నివేదికలో మరిన్ని విశేషాలు.. 
→ ప్రధాన స్రవంతిలోని వంటకాలతో పోలిస్తే గోవా, బీహారీ తదితర ప్రాంతాల వంటకాలపై 2–8 రెట్లు ఆసక్తి పెరుగుతోంది. 
→ కొరియన్, వియత్నాం, మెక్సికన్‌ వంటకాలు ప్రధాన స్రవంతిలోకి చేరుతున్నాయి. వీటికి సంబంధించిన సూచీలు వరుసగా 17, 6, 3.7 రెట్లు పెరిగాయి. పెరూవియా, ఇథియోపియా ఆహారంపై కూడా ఆసక్తి పెరుగుతోంది.  
→ గత ఐదేళ్లుగా బొబా టీ, మాచా టీ మొదలైన వాటిని సెర్చ్‌ చేయడం వరుసగా పెరిగింది.  
→ పానీయాల విభాగంలో బటర్‌మిల్‌్క, షర్బత్‌లాంటి వాటికి డిమాండ్‌ 4–6 రెట్లు అధికంగా ఉంది. దీంతో గ్లోబల్‌ క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్లు కూడా భారత్‌లో పరిస్థితులకు అనుగుణంగా బెవరేజెస్‌ వెరైటీలను తయారు చేస్తున్నాయి.

క్విక్‌ కామర్స్‌ దన్ను.. 
‘కేవలం దశాబ్దకాలంలోనే పరిశ్రమ వైవిధ్యంగా విస్తరించింది. క్విక్‌ కామర్స్‌తో స్పీడ్‌పై అంచనాలు పెరిగిపోయాయి. 10 నిమిషాల ఫుడ్‌ డెలివరీ సర్వీస్‌ బోల్ట్‌ ఇప్పుడు మా ప్లాట్‌ఫాంపై వచ్చే ఆర్డర్లలో 10 శాతం వాటాకి చేరింది. వినియోగదారులు ఒకవైపు చిరపరిచితమైన భారతీయ, ఇటాలియన్‌ వంటకాలను మరింత చౌకగా కోరుకుంటున్నారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేనంతగా బోబా టీ, మాచా టీ లాంటి గ్లోబల్‌ పానీయాలపైనా మక్కువ చూపుతున్నారు.. ఈ నేపత్యంలో క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్లు, క్లౌడ్‌ కిచెన్లు వార్షికంగా సుమారు 17 శాతం వృద్ధి చెందే అవకాశం ఉంది. సంఘటిత ఆహార సేవల విభాగంతో పోలిస్తే ఈ విభాగం 1.5 రెట్లు వృద్ధి చెందవచ్చు‘ అని స్విగ్గీ ఫుడ్‌ మార్కెట్‌ప్లేస్‌ సీఈవో రోహిత్‌ కపూర్‌ తెలిపారు.   

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు