Breaking News

చాట్‌జీపీటీ గో ప్లాన్‌@ రూ. 399

Published on Wed, 08/20/2025 - 00:41

న్యూఢిల్లీ: ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఓపెన్‌ఏఐ భారత్‌లో ‘చాట్‌జీపీటీ గో’కి సంబంధించి కొత్త సబ్‌ స్క్రిప్షన్‌ ప్లాన్‌ ప్రకటించింది. ఉచిత ప్లాన్‌తో పోలిస్తే 10 రెట్లు అధికంగా మెసేజీలు, ఇమేజ్‌ల జనరేషన్, ఫైల్‌ అప్‌లోడ్స్‌ పరిమితులతో ఈ ప్లాన్‌ నెలవారీగా రూ. 399గా ఉంటుంది. చాట్‌జీపీటీ అధునాతన సామర్థ్యాలను మరింత అందుబాటు ధరలో పొందాలనుకునే వారి కోసం ‘చాట్‌జీపీటీ గో’ని డిజైన్‌ చేసినట్లు వివరించింది. 

యాక్సెస్‌ విషయంలో ప్రాధాన్యత, వేగవంతమైన పనితీరు, అధిక యూసేజీ పరిమితులు అందించే ప్రస్తుత చాట్‌జీపీటీ ప్లస్‌కి (నెలకు రూ. 1,999) ఈ కొత్త ప్లాన్‌ అదనంగా ఉంటుంది. అత్యంత అధునాతన మోడల్స్, మరింత కస్టమైజేషన్‌ కావాలనుకునే ప్రొఫెషనల్స్, సంస్థల కోసం చాట్‌జీపీటీ ప్రో (నెలకు రూ. 19,900)ని అందిస్తున్నట్లు ఓపెన్‌ఏఐ వివరించింది. యూపీఐ విధానంతో కూడా సబ్‌ స్క్రిప్షన్‌కి చెల్లింపులు జరపవచ్చని చాట్‌జీపీటీ వీపీ నిక్‌ టర్లీ తెలిపారు. చాట్‌జీపీటీకి భారత్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రెండో భారీ మార్కెట్‌గా ఉంది.

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)