Breaking News

ఐఫోన్ 17 ఎయిర్: స్పందించిన ఓపెన్ఏఐ సీఈఓ

Published on Thu, 09/11/2025 - 18:49

యాపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ ఫోన్‌ను నాలుగు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇందులోని ఎయిర్ వేరియంట్ ఓపెన్ఏఐ సీఈఓ 'సామ్ ఆల్ట్‌మన్'ను తెగ ఆకట్టుకుంది. దీనిపై స్పందిస్తూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

''చాలా కాలంగా నేను కోరుకుంటున్న మొదటి కొత్త ఐఫోన్ అప్‌గ్రేడ్ ఇది! చాలా బాగుంది'' అని యాపిల్ టెక్నాలజీని సామ్ ఆల్ట్‌మన్ ప్రశంసించారు. కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ ఎయిర్ అత్యంత సన్నని హ్యాండ్‌సెట్. ఇది చాలా తేలికగా ఉండటం వల్ల మీ చేతిలో ఇట్టే ఇమిడిపోతుంది. 5.6 మిల్లీమీటర్ల మందం కలిగిన ఫ్రేమ్, కేవలం 165 గ్రాముల బరువు కలిగిన ఇది ఇప్పటివరకు ఉన్న అత్యంత సన్నని ఐఫోన్.

గతంలో చాలామంది ఐఫోన్ ప్రియులు, విశ్లేషకులు.. కొత్త ఆవిష్కరణలు లేదని ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పుడు ఐఫోన్ 17 ఎయిర్ ఎనిమిది సంవత్సరాలలో కంపెనీ ఆవిష్కరించిన అతిపెద్ద మార్పులలో ఒకటిగా నిలిచింది.

ఐఫోన్17 ధరలు
టెక్‌ దిగ్గజం యాపిల్‌ తాజాగా ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను ఆవిష్కరించింది. ఐఫోన్‌ 17లో 6.3 ఇంచెస్ స్క్రీన్, ఏ19 ప్రో ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ డ్యుయల్‌ ఫ్యూజన్‌ కెమెరా, 24 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా, 256 జీబీ మెమొరీ తదితర ఫీచర్లు ఉన్నాయి. అయిదు రంగుల్లో లభించే అత్యంత పల్చని  ఐఫోన్‌ 17 ఎయిర్‌ని కూడా యాపిల్‌ విడుదల చేసింది. ఐఫోన్‌ 17 ధర 799 డాలర్ల నుంచి, ప్రో ధర 1,099 డాలర్లు, ప్రో మ్యాక్స్‌ ధర 1,199 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)