Breaking News

ఆకాశాన్నంటిన ఆహార ధరలు.. అదే ‍ప్రధాన కారణం!

Published on Mon, 07/22/2024 - 16:55

గతేడాది టమాటా ధరలు, ఉల్లి ధరలు మాత్రమే కాకుండా పప్పు ధాన్యాల ధరలు చుక్కలు తాకాయి. ఇప్పడు కూడా టమాటా ధరలు భారీగానే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కేజీ ధర వంద రూపాయలకంటే ఎక్కువ. ఆహార ధరలు పెరగటానికి గల కారణాలను ఆర్ధిక సర్వేలో వెల్లడించారు.

వాతావరణంలో ఏర్పడ్డ మార్పులు, రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గడం, పంట నష్టం వంటివి.. ఆహార ధరలు పెరగటానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక సర్వే వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంటలపై ప్రభావం చూపుతాయి. ఆ ప్రభావం ధరల మీద పడుతుందని వివరించింది.

పంట దిగుబడి తగ్గితే.. డిమాండ్‌కు సరిపడా సరఫరా తగ్గుతుంది. దీంతో ధరలు పెనుగుతాయి. గత కొన్ని రోజులుగా ఆహార ధాన్యాలు, టమాటా, ఉల్లి ధరలు పెరగడానికి ఇదే కారణమని ఆర్ధిక సర్వే వెల్లడించింది. వినియోగదారుల ఆహార ధరల సూచీ (CFPI) ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం FY22లో 3.8 శాతం నుంచి FY23లో 6.6 శాతానికి చేరింది. ఇది FY24 నాటికి 7.5 శాతానికి చేరింది.

ఉల్లి ధరలు పెరగడానికి గత కోత సీజన్‌లో వర్షాలు, విత్తడంలో జాప్యం మాత్రమే కాకుండా ఇతర దేశాలు తీసుకున్న వాణిజ్య సంబంధిత చర్యలు కూడా కారణమని తెలుస్తోంది. తక్కువ ఉత్పత్తి కారణంగా పప్పుధాన్యాల ధరలు పెరిగాయని సర్వే పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ అవాంతరాలతో పాటు రబీ సీజన్‌లో నెమ్మదిగా విత్తడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వెల్లడించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)