Breaking News

తగ్గిన ఓఎన్‌జీసీ లాభం    

Published on Mon, 02/03/2025 - 06:33

న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఓఎన్‌జీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 17 శాతం క్షీణించి రూ. 8,240 కోట్లకు పరిమితమైంది. ముడిచమురు ధరలు నీరసించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 9,892 కోట్లు ఆర్జించింది. కంపెనీ బోర్డు.. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. 

గడిచిన నవంబర్‌లో రూ. 6 చెల్లించిన సంగతి తెలిసిందే. కాగా.. మొత్తం ఆదాయం సైతం 3 శాతం వెనకడుగుతో రూ. 33,771 కోట్లకు చేరింది. ఈ కాలంలో బ్యారల్‌కు ముడిచమురు ధర 72.57 డాలర్లు చొప్పున అందుకుంది. గత క్యూ3లో 81.13 డాలర్లు చొప్పున లభించింది. నేచురల్‌ గ్యాస్‌ ఒక్కో ఎంబీటీయూ 6.5 డాలర్లు చొప్పున విక్రయించింది. ముడిచమురు ఉత్పత్తి స్వల్పంగా 2 శాతం పెరిగి 4.653 మిలియన్‌ టన్నులను తాకింది. నేచురల్‌ గ్యాస్‌ ఉత్పత్తి నామమాత్ర వృద్ధితో 4.978 బీసీఎంకు చేరింది. 

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)