Breaking News

ఓఎన్‌జీసీ లాభం డౌన్‌

Published on Wed, 11/12/2025 - 02:30

న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్‌(క్యూ2)లో నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 9,848 కోట్లకు పరిమితమైంది. ముడిచమురు ధరలు నీరసించడం ప్రభావం చూపింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 11,984 కోట్లు ఆర్జించింది. ముడిచమురు బ్యారల్‌ ధరలు 78.33 డాలర్ల నుంచి 67.34 డాలర్లకు క్షీణించడం లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది.

అయితే పురాతన బావుల నుంచి వెలికితీసే నేచురల్‌ గ్యాస్‌ ధర 3.8 శాతం పుంజుకుని ఒక్కో ఎంఎంబీటీయూ 6.75 డాలర్లను తాకింది. కొత్త బావుల నుంచి వెలికితీసిన గ్యాస్‌ ధర 9.42 డాలర్ల నుంచి 8.36 డాలర్లకు తగ్గింది. దేశీయంగా నిర్ణయించే ఏపీఎం ధరలతో పోలిస్తే వీటికి 20 శాతం ప్రీమియంకు వీలుంటుంది. దీంతో వీటి నుంచి అధికంగా గ్యాస్‌ ఉత్పత్తికి కంపెనీ ప్రాధాన్యత ఇస్తోంది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది.

ఇందుకు రూ. 7,548 కోట్లు వెచి్చంచనుంది. కాగా.. సమీక్షా కాలంలో ఓఎన్‌జీసీ స్థూల ఆదాయం 2.5 శాతం క్షీణించి రూ. 33,031 కోట్లకు పరిమితమైంది. ఈ కాలంలో 4.63 మిలియన్‌ టన్నుల ముడిచమురుతోపాటు.. 4.918 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది.  ఫలితాల నేపథ్యంలో ఓఎన్‌జీసీ షేరు బీఎస్‌ఈలో 0.8 శాతం నష్టంతో రూ. 249 వద్ద ముగిసింది.

Videos

Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్

జగన్ కట్టించిన ఇళ్లకు... చంద్రబాబు హంగామా

Prakash Raj: అవును.. నేను చేసింది తప్పే

మీడియాను ఘోరంగా అవమానించిన లోకేష్

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

కేతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ

మా MROలు వేస్ట్.. జనసేన నేత సంచలన కామెంట్స్

Vidadala Rajini: రాసిపెట్టుకోండి.. జగనన్న ఒకసారి చెప్పాడంటే

New Delhi: పేలుడు ఘటన బాధితులను పరామర్శించిన మోదీ

కపిలతీర్థంలో అయ్యప్ప స్వాములకు అవమానం

Photos

+5

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ లుక్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (ఫొటోలు)

+5

ఈ ఆలయం లో శివుడు తలక్రిందులుగా ఉంటాడు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ ప్రెస్‌మీట్‌లో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ ప్రీ రిలీజ్ లో మెరిసిన చాందినీ చౌదరి (ఫొటోలు)

+5

వణికిస్తున్న చలి.. జాగ్రత్తగా ఉండాల్సిందే (ఫొటోలు)

+5

అల్లరి నరేశ్ 12ఏ రైల్వే కాలనీ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రెహమాన్ కన్సర్ట్ జ్ఞాపకాలతో మంగ్లీ (ఫొటోలు)