Breaking News

విడుదలకు ముందే వన్‍ప్లస్ ట్యాబ్ ధరలు లీక్

Published on Thu, 04/13/2023 - 08:12

టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో రోజు రోజుకి కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి,  అలాంటి కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి కంపెనీలు కూడా ఆసక్తి చూపుతుంటాయి. ఈ నేపథ్యంలో భాగంగానే 'వన్‍ప్లస్' (OnePlus) తన మొదటి ట్యాబ్‍ను దేశీయ విఫణిలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ కొత్త ట్యాబ్‍ విడుదలకు ముందే ధరల వివరాలు లీక్ అయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

భారతీయ మార్కెట్లో విడుదలకానున్న వన్‍ప్లస్ ప్యాడ్ ట్యాబ్‍ను కంపెనీ గత ఫిబ్రవరిలోనే పరిచయం చేసింది. అయితే ఆ సమయంలో కంపెనీ ఈ ప్రొడక్ట్ లాంచ్, ప్రైస్ వంటి వాటిని వెల్లడించలేదు. కంపెనీ అధికారిక ధరలను వెల్లడించకముందే ఈ ట్యాబ్ రూ. 23,099 దరిదాపుల్లో ఉంటుందని కొన్ని నివేదికల ద్వారా తెలిసింది.

లీకైన ధరలను బట్టి చూస్తే ఈ ట్యాబ్ సరసమైన ధర వద్ద లభించే అవకాశం ఉంటుందని అర్థమవుతోంది. ఇది ఈ నెల చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తుంన్నారు. విడుదల సమయంలో కంపెనీ దీని ధరలను వెల్లడిస్తుంది.

(ఇదీ చదవండి: ఇప్పుడు పేటీఎంలో బస్ టికెట్ కొంటే ఆఫర్లే.. ఆఫర్లు!)

త్వరలో విడుదలకానున్న వన్‍ప్లస్ ప్యాడ్ 11.61 ఇంచెస్ 2.8K ఎల్‍సీడీ డిస్‍ప్లే కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్ టాప్ వేరియంట్ 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ పొందుతుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, హెచ్‍డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్ వంటి వాటితో పాటు మీడియాటెక్ డైమన్సిటీ 9000 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.

కెమెరా విషయానికి వస్తే, ఈ కొత్త ట్యాబ్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి 9,510mAh బ్యాటరీతో 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. సౌండ్ కోసం నాలుగు స్పీకర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త ట్యాబ్ కోసం ఇప్పటికే అమెరికా, యూకేలలో ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. ఇండియాలో ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

Videos

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)