భారత్‌లో ఐఫోన్‌ తయారీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

Published on Mon, 05/20/2024 - 17:44

ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్‌ ఐఫోన్‌ ఉత్పత్తుల్లో ప్రతి ఏడింటిలో ఒకటి భారత్‌లోనే తయారవుతోందని ప్రధానిమోదీ అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్‌ఐ) ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ..‘ప్రపంచంలోనే భారత్‌ రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా ఎదిగింది. గ్లోబల్‌గా తయారువుతున్న ఏడు ఐఫోన్‌లలో ఒకటి ఇండియాలోనే తయారుచేస్తున్నారు. ఐఫోన్‌తోపాటు యాపిల్ ఉత్పత్తులను కూడా భారత్‌ రికార్డు సంఖ్యలో ఎగుమతి చేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రొడక్షన్‌ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం ద్వారానే ఇది సాధ్యమైంది’ అని అన్నారు.

2028 నాటికి మొత్తం ఐఫోన్‌లలో 25 శాతం భారత్‌లోనే తయారవుతాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి త్రైమాసికానికి సంబంధించి యాపిల్‌ ఉత్పత్తుల షిప్‌మెంట్‌లో దేశం రికార్డు స్థాయిని చేరుకుంది. దేశంలోని యాపిల్‌ ఉత్పత్తుల్లో ఏడాదివారీగా 19 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ తెలిపింది.

యాపిల్‌ సంస్థ ముంబై, దిల్లీలో రెండు అవుట్‌లెట్‌లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్‌ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ స్టోర్‌లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది.

ముంబై స్టోర్ యాపిల్‌ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్‌ సాకెట్‌ కంటే కొంచెం అధికంగా నమోదవుతోందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనల ద్వారా తెలిసింది. త్వరలో భారత్‌లో మరో మూడు స్టోర్‌లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే గతేడాది జూన్‌లో వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్‌ తన స్టోర్‌లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్‌లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

#

Tags : 1

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)