Breaking News

రూ.652 కోట్లతో మొండి బాకీల కొనుగోలు!

Published on Mon, 08/05/2024 - 12:26

ద్రవ్యోల్బణం పెరుగుతోంది..ఖర్చులూ పెరుగుతున్నాయి..ఇలాంటి సందర్భంలో బ్యాంకులు రుణాలు ఇస్తాయంటే ఎందుకు తీసుకోకుండా ఉంటారు..అయితే వాటిని తిరిగి చెల్లించేపుడు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. దాంతో బ్యాంకుల వద్ద మొండి బకాయిలు పోగవుతున్నాయి. అలా ఒక్క ఐడీబీఐ బ్యాంకు వద్దే ఏకంగా రూ.6,151 కోట్లు పేరుకుపోయాయి. ఆ లోన్లను రికవరీ చేసేందుకు బ్యాంకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఇటీవల ఆ బకాయిలను విక్రయానికి పెట్టింది. వాటిని కొనుగోలు చేసేందుకు ఓంకార అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్‌సీ) గరిష్ఠంగా రూ.652 కోట్లు ఆఫర్‌ చేసినట్లు వార్తాకథనాలు వెలువడ్డాయి.

వార్తా నివేదికల ప్రకారం..ఐడీబీఐ బ్యాంకు తన వద్ద పోగైన రూ.6,151 కోట్ల మొండి బకాయిలను విక్రయించాలని గతంలోనే నిర్ణయించుకుంది. దాంతో ప్రభుత్వ అధీనంలోని నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌తోపాటు ఇతర కంపెనీలు బిడ్డింగ్‌ వేశాయి. తాజాగా ఓంకార అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్‌సీ) ఆ మొండి బకాయిలను దక్కించుకునేందుకు గరిష్ఠంగా రూ.652 కోట్లు(మొత్తంలో 10.5 శాతం) ఆఫర్‌ చేసింది.

బ్యాంకుల్లో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారి సంఖ్య పెరుగుతోంది. వాటిని వసూలు చేసేందుకు ప్రభుత్వం నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌)ను ప్రతిపాదించింది. ఇది బిడ్డింగ్‌లో తక్కువ ధరకు బ్యాంకుల నుంచి మొండి బకాయిలను  దక్కించుకుంటుంది. అనంతరం రుణ గ్రహీతల నుంచి పూర్తి సొమ్మును వసూలు చేస్తోంది. తాజాగా ఎన్‌ఏఆర్‌సీఎల్‌తోపాటు బిడ్డింగ్‌లో పాల్గొన్న ఓంకార ఏఆర్‌సీ అధికమొత్తంలో చెల్లించేందుకు సిద్ధమైంది.

ఇదీ చదవండి: రిటైర్‌మెంట్‌ ప్రకటించిన గౌతమ్‌ అదానీ!

ఐడీబీఐ బ్యాంకులో గరిష్ఠంగా ఎల్‌ఐసీకు 49.24 శాతం వాటా ఉంది. వీటిని 26 శాతానికి తగ్గించేందుకు మే 2021లో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 2022లో ఆసక్తిగల సంస్థలు, వ్యక్తుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కోరింది. ఇటీవల వెలువడిన రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, ఎమిరేట్స్ ఎన్‌బీడీ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బిడ్డర్లుగా ఆమోదించింది. ఈ బ్యాంకులో ఎల్‌ఐసీ తర్వాత గరిష్ఠంగా ప్రభుత్వానికి 45 శాతం వాటా ఉంది.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)