Breaking News

డ్రైవర్ అవసరం లేని ఆటో: ధర ఎంతో తెలుసా?

Published on Tue, 09/30/2025 - 21:17

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ తయారీదారు ఒమేగా సీకి మొబిలిటీ (OSM).. భారతదేశంలో తన మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ ఆటో-రిక్షాను లాంచ్ చేసింది. కంపెనీ దీనికి 'స్వయంగతి' అని పేరు పెట్టింది. ఇది ప్యాసింజర్ వెర్షన్,  కార్గో వెర్షన్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ.4 లక్షలు, రూ. 4.15 లక్షలు (ఎక్స్ షోరూమ్).

ఒమేగా సీకి మొబిలిటీ.. ఈ సరికొత్త అటానమస్ ఎలక్ట్రిక్ ఆటో-రిక్షా కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు వెంటనే ప్రారంభమవుతాయి. ఇది 10.3 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 120 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే దీనికి కావలసిన ఛార్జింగ్ సదుపాయాల గురించి ఎలక్ట్రిక్ వాహన తయారీదారు ఇంకా ఎటువంటి సమాచారం అందించలేదు.

స్వయంగతి ఒమేగా సీకి.. ఏఐ స్వయంప్రతిపత్తి వ్యవస్థను పొందుతుంది. ఈ సెటప్‌లో లి-డార్ టెక్నాలజీ, జీపీఎస్, ఆరు మీటర్ల వరకు అడ్డంకి గుర్తింపు, మల్టీ సెన్సార్ నావిగేషన్, రిమోట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ డ్రైవర్ అవసరం లేకుండానే.. ప్రీ-మ్యాప్ చేసిన మార్గాలను నావిగేట్ చేయడానికి వీలు కల్పిస్తాయి. కంపెనీ ఈ ఆటో రిక్షాను ఇప్పటికే టెస్ట్ చేసింది. రెండో దశలో కూడా టెస్ట్ చేయనున్నట్లు సమాచారం.

విమానాశ్రయాలు, టెక్ పార్కులు, గేటెడ్ కమ్యూనిటీలు, పారిశ్రామిక ప్రాంతాలు, స్మార్ట్ సిటీలలో ఈ ఎలక్ట్రిక్ రిక్షాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే కంపెనీ ఈ ఆటో రిక్షాను లాంచ్ చేసింది. ఒమేగా సీకి మొబిలిటీ రాబోయే రెండు సంవత్సరాలలో 1,500 అటానమస్ త్రీ-వీలర్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)