Breaking News

అందుకే వృద్ధులకు ఉపాధి కరవు: మెకిన్సే నివేదిక

Published on Thu, 11/23/2023 - 18:59

రిటైర్‌మెంట్‌ గడువు దగ్గర పడుతున్న వారిలో, పదవి విరమణ పొందిన వారిలో ఇంకా పని చేయాలనే తపన చూస్తూంటాం. అందుకు వారు ఎంతో ప్రయత్నించాలి. వయసు భారం అనుకోకుండా సరైన నైపుణ్యాలు ఉంటే ఎన్నో అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయంగా ఇంకా పనిచేయాలనుకునే వృద్ధులతో పోలిస్తే భారతీయ వృద్ధులకు తక్కువ అవకాశాలు ఉన్నట్లు మెకిన్సే హెల్త్ ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ రిపోర్ట్ పేర్కొంది. అందుకుగల కొన్ని కారణాలను విశ్లేషించింది.

మెకిన్సే 21 దేశాల్లోని 55 ఏళ్లకంటే ఎక్కువ వయసు ఉన్న దాదాపు 21,000 మందిపై సర్వే  చేసి ఈ నివేదిక రూపొందించింది. అందులో 1,000 మంది భారతీయులున్నారు. నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియా 7.8 శాతం జీడీపీ వృద్ధిరేటు సాధించాలంటే వృద్ధులుసైతం పనిచేయాలని గతంలో కొందరు అభిప్రాయపడ్డారు. కొంతమంది భారతీయ వృద్ధులకు ఇప్పటికీ కుటుంబ సంరక్షణే భారంగా మారుతోంది. మరికొందరు సంపన్నులను అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయి. అన్నీ అనుకూలంగా ఉన్నవారు సాంకేతికతపై, స్మార్ట్‌ఫోన్‌ల వాడకంపై ఆసక్తి చూపినప్పటికీ దాన్ని పూర్తిగా నేర్చుకోలేకపోతున్నారు.

ఇదీ చదవండి: పాతపద్ధతే మేలు.. ‘ఎక్స్‌’ ప్రకటన

నాలెడ్జ్ గ్యాప్, వారు అధికంగా పనిచేయకపోవడం వంటి అడ్డంకులున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి వారికి సరైన శిక్షణ ఇవ్వడంతోపాటు అవగాహన పెంపొందించడం ఎంతో అవసరం. 55-64 ఏళ్ల వయసు ఉన్న వారిలో కంటే 80 ఏళ్లు దాటిన వారిలో 20-25 శాతం అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలపై అవగాహన, ఆర్థిక ప్రణాళిక, నైపుణ్య శిక్షణతో దిగువ మధ్యతరగతి వృద్ధుల కుటుంబాల్లో ఆదాయ మార్గాలను పెంపొందించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)