Breaking News

లిథియం బ్లాక్‌ల వేలంలో పాల్గొననున్న ప్రముఖ కంపెనీ?

Published on Thu, 02/08/2024 - 14:25

పెరుగుతున్న ఇంధన అవసరాల దృష్ట్యా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. శిలాజ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఎలక్ట్రిక్‌ వాహనాల్లోని బ్యాటరీల్లో వినియోగించే లిథియం అయాన్‌ బ్లాక్‌లను వేలం వేసేందుకు నిర్ణయించింది.

ప్రభుత్వం చేపడుతున్న క్రిటికల్ మినరల్స్‌ ఆక్షన్‌‌‌‌లో ఓలా ఎలక్ట్రిక్ పాల్గొనాలని చూస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. లిథియం అయాన్ బ్లాక్‌‌‌‌లను వేలంలో దక్కించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. లిథియం వంటి కీలక మినరల్స్‌‌‌‌ సరఫరా పెంచేందుకు ప్రభుత్వం కిందటేడాది చివరి నుంచి  ఆక్షన్ చేపడుతోంది. ఎనిమిది రాష్ట్రాల్లోని 20 బ్లాక్‌‌‌‌లను వేలం వేస్తోంది.

ఇదీ చదవండి: ఎడ్‌టెక్‌ కంపెనీకు నోటీసులు.. ఎందుకో తెలుసా..

ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం రూ.45 వేలకోట్లు సేకరించనుందని అంచనా. పెట్రోల్‌‌‌‌, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌ను ప్రమోట్‌‌‌‌  చేస్తున్న విషయం తెలిసిందే. కిందటి ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన మొత్తం 39 లక్షల వెహికల్స్‌‌‌‌లో  ఈవీల వాటా 2 శాతం ఉంది.  ఇది 2030 నాటికి 30 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆక్షన్‌కు సంబంధించి ఓలా సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

#

Tags : 1

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)