Breaking News

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సేల్స్‌లో రికార్డ్‌: ఓలాదే ఆధిపత్యం, ఎందుకో తెలుసా?

Published on Thu, 06/01/2023 - 16:58

దేశీయ అతిపెద్ద ఈవీ మేకర్‌ ఓలా ఎలక్ట్రిక్ మే నెలలో బంపర్‌ సేల్స్‌ సాధించింది. 35వేల యూనిట్లకు పైగా విక్రయాలు నమోదు చేయగా, మొత్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు రికార్డు సృష్టించడం విశేషం. (రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్‍ క్వీన్‌, ఆ నిర్మాత ఇంటిపక్కనే!)

కంపెనీ గత మూడు త్రైమాసికాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీంతో, ఓలా మే నెలలో 30శాతం పైగా మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంది గత ఏడాది మే నెలలోని నమోదైన విక్రయాలతో  పోలిస్తే ఏకంగా  300 శాతం వృద్ధిని సాధించింది.

మరోవైపు దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు మే 2023 నెలలో అద్భుతమైన పెరుగుదల నమోదైంది. తొలిసారిగా ఒకే నెలలో లక్ష మార్కును దాటడం విశేషం. ఏప్రిల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 57శాతం పైగా పెరిగాయి. ఈవీ అమ్మకాలకు సంబంధించి మే నెల  బెస్ట్‌గా  నిలిచింది.   ఏథర్, ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలు మేలో తమ అత్యుత్తమ నెలవారీ విక్రయాలను నమోదు చేశాయి. (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట?)

అటు నెలనెలా తమ అమ్మకాలు ఆకట్టుకునే వృద్ధిని సాధించాయనీ, దేశంలో ఈవీ విప్లవానికి ఓలా లీడర్‌గా కొన సాగుతోందంటూ ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు , సీఈవో భవిష్ అగర్వాల్ సంతోషాన్ని ప్రకటించారు. బ్రాండ్‌పై కస్టమర్ విశ్వాసాన్ని, ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌కు ఇది నిదర్శనమన్నారు. ప్రభుత్వ సబ్సిడీలలో గణనీయమైన తగ్గింపు ఉన్నప్పటికీ, తాము  జూన్ నుండి  స్కూటర్ ధరలను స్వల్పంగా మాత్రమే పెంచిందన్నారు.

కాగా ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECలు) ఏర్పాటు చేయడం ద్వారా దేశంలో ఓలా తన ఆఫ్‌లైన్ ఉనికిని చురుకుగా పెంచుతోంది. కంపెనీ ఇటీవలే తన 600వ ఈసీని  ప్రారంభించింది.  ఆగస్టు నాటికి ఈ సంఖ్యను 1,000కి చేర్చాలని యోచిస్తోంది.  

సేల్స్‌ ఎందుకు పెరిగాయి? 
ఫేమ్‌ - II సబ్సిడీకి  మే చివరి నెల కావడమే అధిక విక్రయాలకు ఒక కారణం. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్టర్ అడాప్షన్  అండ్‌  తయారీ (FAME II) పథకం కింద, వాహన ధరలో గరిష్టంగా 40 శాతం పరిమితితో కిలోవాట్-గంటకు (kWh) రూ. 15,000 సబ్సిడీని భారత ప్రభుత్వం అందిస్తోంది.  1 జూన్ 2023 నుంచి సవరించిన అమలులోకి వస్తుంది. ఈ సబ్సిడీని రూ. 10,000కి తగ్గించింది. వాహన ధరలో 15 శాతానికి పరిమితం చేసింది.  ఫలితంగా  ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు  భారీగా పెరుగుతాయనే అంచనాలున్నాయి. 
 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)