Breaking News

ఓలా ఎలక్ట్రిక్‌ తొలి  ‘రోడ్‌స్టర్‌ ఎక్స్‌’ బైక్‌ విడుదల 

Published on Sat, 04/12/2025 - 05:42

న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ క్రిష్ణగిరి ‘ఫ్యూచర్‌ఫ్యాక్టరీ’లో తయారుచేసిన తొలి ‘రోడ్‌స్టర్‌ ఎక్స్‌ మోటార్‌సైకిల్‌’ను శుక్రవారం విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ ఈ ఏప్రిల్‌లో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ‘‘విద్యుత్‌ వాహన విప్లవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే నిబద్దతకు ప్రతిరూపమే ‘రోడ్‌స్టర్‌ ఎక్స్‌ సిరీస్‌’. మా కొత్త ఉత్పత్తి ఎలక్ట్రిక్‌ మొబిలిటీ రంగంలో కొత్త శకానికి నాందిగా నిలిస్తుంది.’’ అని కంపెనీ చైర్మన్‌ ఎండీ భవీశ్‌ అగర్వాల్‌ తెలిపారు. 

ఓలా ఈ బైక్‌ను కొత్తగా అభివృద్ధి చేసిన మిడ్‌–డ్రైవ్‌ మోటార్‌తో రూపొందించింది. ఇందులో ఎంసీయూ ఇంటిగ్రేషన్‌ వంటి ఆధునిక టెక్నాలజీ కూడా ఉంది.  ఐపీ67 సరి్టఫైడ్‌ బ్యాటరీలు ఉన్నాయి. ఓలా రోడ్‌స్టర్‌ ఎక్స్‌ సిరీస్‌ 2.5 కిలోవాట్‌ హవర్‌(కేడబ్ల్యూహెచ్‌) 3.5 కేడబ్ల్యూహెచ్, 4.5 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ఆప్షన్‌లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.84,999, రూ.94,999, రూ.1,04,999గా ఉన్నాయి. కాగా, ఎక్స్‌ప్లస్‌ సిరిస్‌లో 4.5కేడబ్ల్యూహెచ్‌ బైక్‌ ధర రూ.1,14,999 లక్షలు ఉండగా, 9.1కేడబ్ల్యూహెచ్‌ బైక్‌ ధర రూ.1,84,999గా ఉంది.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)