Breaking News

ఓలా ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది.. టార్గెట్‌ రూ. 5,500 కోట్లు

Published on Sun, 07/28/2024 - 11:20

ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్‌ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ వచ్చే వారం ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానుంది. ఆగస్టు 2న రిటైల్ సబ్‌స్క్రిప్షన్‌లు ప్రారంభించనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. సంస్థాగత పెట్టుబడిదారులకు మాత్రం ఒక రోజు ముందుగా ఆగస్టు 1న సబ్‌స్క్రిప్షన్‌లు తెరుచుకోనున్నాయి. ఆగస్టు 6న ఐపీఓ ముగుస్తుంది.

ఐపీఓ ద్వారా రూ. 5,500 కోట్లను (సుమారు 657 మిలియన్‌ డాలర్లు) ఆర్జించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఆఫర్ ఫర్ సేల్ (OFS)లో భాగంగా దాదాపు 38 మిలియన్ షేర్లను విక్రయించాల్సి ఉందని కంపెనీ తెలిపింది. 2023 డిసెంబర్లో దాఖలు చేసిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌లో సూచించిన 47.4 మిలియన్ షేర్ల విక్రయం కంటే ఇది దాదాపు 20% తక్కువ.

ఓలా ఎలక్ట్రిక్‌ సుమారు 4.2 బిలియన్‌ డాలర్ల నుంచి 4.4 బిలియన్‌ డాలర్ల వాల్యూషన్‌తో ఐపీఓకు వస్తోంది. సింగపూర్‌కు చెందిన పెట్టుబడి సంస్థ టెమాసెక్‌ గతేడాది 140 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టిన తర్వాత కంపెనీ విలువను 5.4 బిలియన్‌ డాలర్లుగా నిర్ణయించింది. ఆ మొత్తంతో పోలిస్తే.. ఇప్పుడు కంపెనీ ఐపీఓ వాల్యూషన్‌ 20 శాతం మేర తగ్గడం గమనార్హం.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)