Breaking News

గూగుల్‌ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు.. రూ.100 కోట్లు ఆదా!

Published on Sat, 07/06/2024 - 13:54

ప్రముఖ ఆన్‌లైన్‌ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఓలా గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఓలా క్యాబ్స్‌ ప్లాట్‌పామ్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ను వినియోగించబోమని తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది. గూగుల్‌ ‍మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకి ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతాయని సంస్థ సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఓలా క్యాబ్‌ సర్వీస్‌ల్లో గూగుల్‌ మ్యాప్స్‌ను రద్దు చేస్తున్నాం. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. గూగుల్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకు ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతుంది. కొత్త సర్వీసులు అందుబాటులోకి రావాలంటే వినియోగదారులు తమ ఓలా యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఓలా లొకేషన్ ఇంటెలిజెన్స్‌లో స్ట్రీట్‌ వ్యూ, ఇండోర్‌ చిత్రాలు, డ్రోన్ మ్యాప్‌లు, 3డీ మ్యాప్‌ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి’ అని చెప్పారు.

ఓలా క్లౌడ్‌ సర్వీస్‌లను గతంలో మైక్రోసాఫ్ట్ అజూర్‌ నిర్వహించేది. కానీ ఇటీవల ఆ సంస్థతో కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు ఓలా ప్రకటించింది. అజూర్‌ స్థానంలో  ‘క్రుత్రిమ్‌ ఏఐ క్లౌడ్‌’ సేవలు వినియోగించుకుంటున్నామని కంపెనీ తెలిపింది. ఈ క్రుత్రిమ్‌ ఏఐ మ్యాపింగ్‌ సొల్యూషన్స్‌ను కూడా అందిస్తుందని పేర్కొంది. త్వరలో ఈ క్లౌడ్‌లో మరిన్ని ప్రోడక్ట్ అప్‌డేట్‌లు వస్తాయని చెప్పింది.

ఇదీ చదవండి: సంగీత్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబం

అక్టోబర్ 2021లో ఓలా పుణెకు చెందిన జియోసాక్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ‘జియోస్పేషియల్’ సేవలను అందిస్తోంది. గూగుల్‌ మ్యాప్స్‌ స్థానంలో ఓలా క్యాబ్స్‌ జియోసాక్‌ సేవలు వినియోగించుకుంటుంది. దాంతో కంపెనీకు ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)