Breaking News

కాలుష్య కట్టడికి రూ.25 వేలకోట్లు

Published on Sun, 09/15/2024 - 07:58

ప్రభుత్వ ఆధీనంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ 2040 నాటికి తన ఉత్పత్తుల తయారీలో ఎలాంటి కర్బన ఉద్గారాలు విడుదల కాకుండా ప్రయత్నాలు చేపట్టింది. అందుకోసం రూ.25,000 కోట్ల పెట్టుబడితో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ రంజిత్ రాత్ తెలిపారు.

ఈ సందర్భంగా రంజిత్ రాత్ మాట్లాడుతూ..‘క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌లు, బయోగ్యాస్, ఇథనాల్ ప్లాంట్‌లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశాం. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలున్నాయి. దాంతో నికర జీరో కర్బన ఉద్గారాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 65 లక్షల టన్నుల ముడి చమురు ఉత్పత్తి చేశాం. 2025-26 నాటికి ఇది 90 లక్షల టన్నులకు చేరుతుంది. అస్సాంలోని రవాణా, పరిశ్రమలకు ఉపయోగపడే ద్రవ ఇంధనాల స్థానంలో సహజ వాయువులు వాడేందుకు అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి 80 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే అస్సాంలో 640 మెగావాట్లు, హిమాచల్ ప్రదేశ్‌లో మరో 150 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని చెప్పారు.

ఇదీ చదవండి: వంటనూనె ధరలు పెంపు..?

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అన్ని విభాగాల్లో 2046 నాటికి నికర జీరో కర్బన ఉద్గారాలు లక్ష్యంగా నిర్ణయించుకుంది. చమురు, గ్యాస్ ఉత్పత్తిదారైన ఓఎన్‌జీసీ 2038 నాటికి అదే లక్ష్యాన్ని సాధించడానికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్‌), గెయిల్‌ ఇండియా లిమిటెడ్ తమ కార్యకలాపాల్లో నికర సున్నా కర్బన ఉద్గారాలను సాధించడానికి 2040 లక్ష్యంగా పెట్టుకున్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌) 2046 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించింది.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు