‘నుమాలీగఢ్‌’కు బీపీసీఎల్‌ గుడ్‌బై!

Published on Tue, 03/02/2021 - 05:44

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణ దిశగా మరో అడుగు ముందుకు పడింది. తాజా పరిణామం ప్రకారం.. ముందుగా అస్సాంలోని నుమాలీగఢ్‌ రిఫైనరీ (ఎన్‌ఆర్‌ఎల్‌) నుంచి బీపీసీఎల్‌ వైదొలగనుంది. ఎన్‌ఆర్‌ఎల్‌లో తనకున్న 61.65 శాతం వాటాను అస్సాం ప్రభుత్వం, ఆయిల్‌ ఇండియా, ఇంజినీర్స్‌ ఇండియా కన్సార్షియంనకు విక్రయించనుంది. ఈ డీల్‌ విలువ సుమారు రూ. 9,876 కోట్లుగా ఉండనుంది. అస్సాం శాంతి ఒడంబడిక ప్రకారం ఎన్‌ఆర్‌ఎల్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే.. ప్రైవేటీకరణ బాటలో ఉన్న బీపీసీఎల్‌ చేతుల నుంచి ఎన్‌ఆర్‌ఎల్‌ను పక్కకు తప్పించడం ద్వారా దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘మార్చి 1న జరిగిన బోర్డు సమావేశంలో .. ఎన్‌ఆర్‌ఎల్‌లో బీపీసీఎల్‌కి ఉన్న మొత్తం 445.35 కోట్ల షేర్లను అస్సాం ప్రభుత్వం, ఆయిల్‌ ఇండియా, ఇంజినీర్స్‌ ఇండియాల కన్సార్షియంనకు విక్రయించే ప్రతిపాదనకు బోర్డు డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు’ అని స్టాక్‌ ఎక్సే్చంజీలకు బీపీసీఎల్‌ సోమవారం తెలియజేసింది. ‘ఎన్‌ఆర్‌ఎల్‌లో నియంత్రణాధికారాలను బదలాయించాలని బీపీసీఎల్‌ బోర్డు నిర్ణయించింది. దీనితో భారత్‌ పెట్రోలియం ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత పుంజుకుంటుంది’ అని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే.. ట్వీట్‌ చేశారు. ఎన్‌ఆర్‌ఎల్‌ను విక్రయించిన తర్వాత బీపీసీఎల్‌ చేతిలో మూడు రిఫైనరీలు (ముంబై, కొచ్చి, బీనా) మిగులుతాయి.

2021–22 ప్రథమార్ధంలో ప్రైవేటీకరణ..
బీపీసీఎల్‌ను ప్రైవేటీకరించడంలో భాగంగా కంపెనీలో తనకున్న మొత్తం 52.98 శాతం వాటాలను కేంద్రం విక్రయిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వేదాంత గ్రూప్‌తో పాటు అపోలో గ్లోబల్, థింక్‌ గ్యాస్‌ తదితర సంస్థలు వీటిని కోనుగోలు చేసేందుకు పోటీపడుతున్నాయి.

Videos

EVM ట్యాంపరింగ్ పై చంద్రబాబు కామెంట్స్....

టీడీపీ నేతల దాడులపై కాటసాని రామిరెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్

చంద్రబాబు మంత్రివర్గం రేసులో బీజేపీ నేతలు

కాంగ్రెస్ ఓట్లు కూడా మాకే

అగ్నికుల్ కాస్మోస్ అనే స్మార్టప్ కంపెనీ సాధించిన విజయం

నీట్ గందరగోళం టెన్షన్ లో విద్యార్థులు

జనసేనకు 4 మంత్రి పదవులు..

జనసేనకు 4 మంత్రి పదవులు..

ఈ గ్రామంలో పెన్షన్లు లేపేస్తున్న.. టీడీపీ బెదిరింపులు

రైతులకు గుడ్ న్యూస్..తొలి సంతకం చేసిన ప్రధాని మోదీ

Photos

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)