Breaking News

నిలకడగా ఆఫీస్‌ అద్దెలు.. హైదరాబాద్‌లో డౌన్‌

Published on Thu, 07/06/2023 - 06:36

న్యూఢిల్లీ: ఆఫీసు అద్దెలు దేశవ్యాప్తంగా ఆరు ముఖ్య పట్టణాల్లో ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంలో స్థిరంగా ఉన్నట్టు కొలియర్స్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. ఈ పట్టణాల్లో చదరపు అడుగు అద్దె సగటున రూ.95గా ఉంది. ఈ పట్టణాల్లో 32 శాతం అదనపు కార్యాలయ వసతి ఈ కాలంలో అందుబాటులోకి వచి్చంది. ఇక కార్యాలయ స్థలాల కోసం డిమాండ్‌ 2 శాతం పెరిగింది. హైదరాబాద్‌తో పాటు పుణె, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతాల వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి. స్థూల ఆఫీసు స్పేస్‌ లీజు జూన్‌ క్వార్టర్‌లో క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలో పోలి్చచూసినప్పుడు, 2 శాతం పెరిగి 14.6 మిలియన్‌ చదరపు అడుగులకు చేరుకుంది. టెక్నాలజీ, ఇంజనీరింగ్, తయారీ రంగాల నుంచి లీజు కోసం డిమాండ్‌ పెరిగింది.  

ఢిల్లీల్లో వృద్ధి
ఢిల్లీ మార్కెట్లో ఆఫీస్‌ స్పేస్‌ లీజు 11 శాతం పెరిగి 3.1 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది. కొత్తగా కార్యాలయ స్థలాల అందుబాటు. 43 శాతం పెరిగి 2.1 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. నెలవారీ అద్దె చదరపు అడుగుకు రూ.94.20గా ఉంది. ముంబైలో ఆఫీస్‌ స్పేస్‌ లీజు 41 శాతం క్షీణించి 1.6 మిలియన్‌ చదరపు అడుగులకు పరిమితమైంది. నూతన సరఫరా 79 శాతం తగ్గి 0.2 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. కార్యాలయ అద్దె చదరపు అడుగుకు రూ.140.10గా నమోదైంది. పుణెలో లీజు పరిమాణం 1.7 మిలియన్‌ చదరపు అడులుగా ఉంటే, ఒక చదరపు అడుగు అద్దె రూ.76.70గా ఉంది. నూతర సరఫరా 52 శాతం పెరిగి 0.9 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది.

హైదరాబాద్‌లో డౌన్‌
హైదరాబాద్‌ మార్కెట్లో ఆఫీస్‌ స్పేస్‌ లీజు జూన్‌ త్రైమాసికంలో 22 శాతం క్షీణించి 1.5 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజు పరిమాణం 1.9 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉండడం గమనించొచ్చు. అయితే, కార్యాలయ స్థలాల నూతన సరఫరా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 19 శాతం తగ్గి 3 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. నెలవారీ కార్యాలయ వసతి అద్దె చదరపు అడుగుకు రూ.73.70గా ఉంది.

క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.73.60గా ఉండడం గమనార్హం. చెన్నై మార్కెట్లో అత్యధికంగా ఆఫీస్‌ స్పేస్‌ లీజు మూడు రెట్లు పెరిగి 3.3 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది. ఇక్కడ కొత్త సరఫరా 2.4 మిలియన్‌ చదరపు అడుగులకు పెరిగింది. ఆఫీస్‌ అద్దె చదరపు అడుగుకు రూ.75.1గా ఉంది. బెంగళూరు మార్కెట్లో ఆఫీస్‌ అద్దె రూ.91.90గా నమోదైంది. ఆఫీస్‌ స్పేస్‌ లీజు పరిమాణం 22 శాతం తగ్గి 3.4 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. నూతన సరఫరా రెండింతలు పెరిగి 3.8 మిలియన్‌ చదరపు అడుగులకు చేరుకుంది.

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)