Breaking News

రిలయన్స్‌ జియోకు 37.6 లక్షల మంది దూరం

Published on Tue, 12/24/2024 - 09:41

న్యూఢిల్లీ: టెలికం రంగ సంస్థ రిలయన్స్‌ జియో(reliance jio) అక్టోబర్‌లో 37.6 లక్షల మంది వైర్‌లెస్‌ సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. టెల్కోలు కీలకంగా వ్యవహరించే క్రియాశీల మొబైల్‌ సబ్‌స్క్రైబర్స్‌ జియోకు 38.47 లక్షల మంది పెరిగారు. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ విడుదల చేసిన నెలవారీ డేటా ప్రకారం.. అక్టోబర్‌లో భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) 19.28 లక్షల మంది వైర్‌లెస్‌ చందాదార్లను కొత్తగా దక్కించుకుంది. యాక్టివ్‌ కస్టమర్లు దాదాపు 27.23 లక్షలు అధికం అయ్యారు. వొడాఫోన్‌ ఐడియా 19.77 లక్షల వైర్‌లెస్‌ సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. క్రియాశీల చందాదార్లు 7.23 లక్షల మంది తగ్గారు.

రిలయన్స్‌ జియో మొత్తం వైర్‌లెస్‌ వినియోగదార్ల సంఖ్య అక్టోబర్‌ నాటికి 46 కోట్లకు వచ్చి చేరింది. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 46.37 కోట్లుగా ఉంది. సెప్టెంబర్‌తో పోలిస్తే వొడాఫోన్‌ ఐడియా మొత్తం వైర్‌లెస్‌ యూజర్‌ బేస్‌ 21.24 కోట్ల నుంచి అక్టోబర్‌లో 21.04 కోట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్‌ వైర్‌లెస్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 106.6 కోట్లుగా ఉంది. మొత్తం బ్రాడ్‌బ్యాండ్‌ (broadband) చందాదారులు అక్టోబర్‌ 2024 చివరి నాటికి 0.31 శాతం తగ్గి 94.14 కోట్లుగా ఉన్నారు. మొత్తం టెలిఫోన్‌ చందాదారుల సంఖ్య 119.06 కోట్ల నుండి 0.21 శాతం తగ్గి 118.82 కోట్లకు క్షీణించింది. 

ఇదీ చదవండి: ఆన్‌లైన్‌ ఉన్నా చివరకు షోరూంలోనే.. 

తెలుగు రాష్ట్రాల వైర్‌లైన్‌లో జియో వృద్ధి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో (ఏపీ టెలికం సర్కిల్‌) వైర్‌లైన్‌ విభాగంలో అక్టోబర్‌లో గణనీయంగా వృద్ధి సాధించినట్లు రిలయన్స్‌ జియో తెలిపింది. ట్రాయ్‌ (TRAI) గణాంకాల ప్రకారం రెండు రాష్ట్రాల్లో నికరంగా 69,930 కనెక్షన్లు కొత్తగా జతయినట్లు వివరించింది. దీంతో సెప్టెంబర్‌లో 17,49,696గా ఉన్న సబ్‌స్కైబర్ల సంఖ్య అక్టోబర్‌లో 18,19,626కి చేరినట్లు సంస్థ పేర్కొంది.
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)