Breaking News

నైకా లాభాల కేక.. ఏడాదిలో త్రిబుల్‌

Published on Sun, 11/09/2025 - 12:55

ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈ–కామర్స్‌ (నైకా మాతృ సంస్థ) సెప్టెంబర్‌ క్వార్టర్‌లో పటిష్ట పనితీరు నమోదు చేసింది. లాభం రూ.34.4 కోట్లకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.10 కోట్లతో పోల్చి చూస్తే మూడింతలైంది. ఆదాయం 25 శాతం పెరిగి రూ.2,346 కోట్లకు చేరుకుంది.

క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,875 కోట్లుగా ఉంది. జూన్‌ త్రైమాసికంతో పోల్చి చూస్తే లాభం 47 శాతం, ఆదాయం 9 శాతం చొప్పున పెరిగాయి. స్థూల వస్తు విక్రయ విలువ (జీఎంవీ) 30 శాతం పెరిగి రూ.4,744 కోట్లకు చేరింది. వివిధ విభాగాల్లో వృద్ధి వేగాన్ని అందుకున్నట్టు నైకా వ్యవస్థాపకురాలు, సీఈవో ఫాల్గుణి నాయర్‌ తెలిపారు.

సెప్టెంబర్‌ త్రైమాసికంలో 19 కొత్త స్టోర్లను ప్రారంభించినట్టు, దీంతో తమ ఓమ్ని ఛానల్‌ నెట్‌వర్క్‌ (ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌) మరింత బలపడినట్టు చెప్పారు. ఫ్యాషన్‌ విభాగం జీఎంవీ 37 శాతం పెరిగి రూ.1,180 కోట్లుగా, బ్యూటీ జీఎంవీ 28% పెరిగి రూ.3,551 కోట్లుగా ఉన్నాయి.

కలిసొచ్చిన కత్రినా, రిహన్నా యాడ్స్‌

త్రైమాసిక ఫలితాలు నైకా తన ప్రధాన సౌందర్య వ్యాపారాన్ని రెట్టింపు చేయడం ద్వారా లాభదాయకతపై దృష్టి పెట్టినట్లు చూపిస్తున్నాయి. బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్, హాలీవుడ్‌ బ్యూటీ రిహన్నా చేసిన యాడ్స్‌ కలిసొచ్చాయి. అలాగే వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంచడం, ఆఫ్ లైన్ ఉనికిని విస్తరించడం వంటి బ్రాండ్‌ ఉత్పత్తుల అమ్మకానికి దోహదపడ్డాచయి.

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)