Breaking News

మున్సిపల్‌ బాండ్లకు వెబ్‌సైట్‌

Published on Sat, 03/22/2025 - 08:23

న్యూఢిల్లీ: మున్సిపల్‌ బాండ్ల కోసం ప్రత్యేకించిన వెబ్‌సైట్‌ను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) ఆవిష్కరించింది. తద్వారా దేశీయంగా మున్సిపల్‌ బాండ్ల మార్కెట్లలో క్రెడిబిలిటీ, విజిబిలిటీని పెంచనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. దేశీ మున్సిపల్‌  బాండ్లపై సమగ్ర డేటాను అందించడం ద్వారా మార్కెట్లో లావాదేవీలు నిర్వహించేవారికి వెబ్‌సైట్‌ ప్రధాన కేంద్రంగా నిలవనున్నట్లు తెలియజేసింది.

బాండ్ల జారీ, క్రెడిట్‌ రేటింగ్స్, లావాదేవీల పరిమాణం, వాస్తవిక ఈల్డ్స్, ధరలు తదితరాలను ఇందులో అందించనుంది. అంతేకాకుండా దేశీయంగా తొలి మున్సిపల్‌ బాండ్‌ ఇండెక్స్‌ అయిన నిఫ్టీ ఇండియా మున్సిపల్‌ బాండ్‌ ఇండెక్స్‌ గత చరిత్ర తదితర పూర్తి వివరాలకు ఇది వేదిక కానుంది. పారదర్శకంగా, సులభంగా బాండ్ల సమాచారాన్ని పొందగలగడంతోపాటు.. ఇన్వెస్టర్లలో అవగాహన పెంచే లక్ష్యాలతో వెబ్‌సైట్‌ను తీసుకువచ్చినట్లు ఎన్‌ఎస్‌ఈ వివరించింది. ఎప్పటికప్పుడు సంబంధిత తాజా సమాచారాన్ని నిర్మాణాత్మక పద్ధతిలో సమకూర్చడం ద్వారా మున్సిపల్‌ బాండ్లను పెట్టుబడి సాధనంగా విశ్వసించేందుకు వెబ్‌సైట్‌ దోహదపడనున్నట్లు తెలియజేసింది.

ఇదీ చదవండి: హెచ్‌సీఎల్‌ గ్రూప్‌తో ప్రుడెన్షియల్‌ జత

సంస్థాగత, రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో వీటిలో లావాదేవీలు నిర్వహించేందుకు వెబ్‌సైట్‌ సహకరించనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. వెరసి పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది మద్దతివ్వనున్నట్లు తెలియజేశారు. ముని బాండ్లుగా పిలిచే వీటిని స్థానిక ప్రభుత్వాలు, ఏజెన్సీలు, రోజువారీ నిధుల అవసరాలకు జారీ చేస్తాయి. జాతీయ రహదారులు, రహదారులు, స్కూళ్ల నిర్మాణ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు సైతం వీటిని వినియోగిస్తాయి. 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)