Breaking News

ఎన్‌ఎస్‌ఈ ఐపీవో 18న!

Published on Wed, 09/09/2026 - 00:03

కోల్‌కతా: స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ ఈ నెల 18న పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 22న ఇష్యూ ముగియనుండటంతో ఈ నెల 25కల్లా లిస్ట్‌కావచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఎక్స్ఛేంజీ సొంత షేర్ల లిస్టింగ్‌కు సెబీ నిబంధనలు అనుమతించనందున మరో స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్‌ఈలో నమోదుకానుంది. ఇదే బాటలో ఇప్పటికే ఎన్‌ఎస్‌ఈలో బీఎస్‌ఈ లిస్టయిన విషయం విదితమే. ఇష్యూలో భాగంగా ఎన్‌ఎస్‌ఈ చెల్లించిన వాటా మూలధనంలో 6 శాతం వాటాను విక్రయించనుంది. రూ. 1 ముఖ విలువగల 14.89 కోట్ల షేర్లను ఎక్స్ఛేంజీలోని ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.

 తద్వారా రూ. 30,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు ధరల శ్రేణి 15కల్లా ప్రకటించే అవకాశముంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 17న షేర్లను ఆఫర్‌ చేసే వీలుంది. ఇప్పటివరకూ 2024లో రూ. 27,870 కోట్లు సమీకరించిన హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఇష్యూ అతిపెద్ద ఐపీవోగా నిలుస్తోంది. ఎన్‌ఎస్‌ఈ లిస్టయితే సరికొత్త రికార్డు నమోదు కానుంది. ఇష్యూ నిధులు ఎన్‌ఎస్‌ఈకికాకుండా షేర్లను ఆఫర్‌ చేస్తున్న వాటాదారులకు చేరనున్నాయి. ట్రేడయ్యే కాంట్రాక్టుల సంఖ్యరీత్యా ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజీగా ఎన్‌ఎస్‌ఈ నిలుస్తుండటం గమనార్హం! 

#

Tags : 1

Videos

DSC అక్రమాలపై లోకేష్‌ జైలుకు వెళ్లడం పక్కా

సెప్టెంబర్లోనే నా పాదయాత్ర రాసిపెట్టుకోండి హిస్టరీ రిపీట్ చేద్దాం

మిడ్ నైట్ గుస గుసలు.. ఆటను రామ్ ప్రసాద్ మారుస్తున్నాడా?

2019 హిస్టరీ రిపీట్ చేద్దాం.. జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం

సాక్షి సంచలన రిపోర్ట్...బయటపడ్డ మరో వ్యక్తి

భారీగా తగ్గిన బంగారం ధరలు తులం ఎంతంటే?

చిన్న శ్రీను పార్టీ మారడంపై బొత్స హాట్ కామెంట్స్

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

వైఎస్ జగన్ 27% IR ఇస్తామన్నారు, ఇచ్చారు...! నువ్వు ఏం ఇచ్చావ్ బాబు

అసలు గేమ్ ఇదేనా..? అడ్డంగా దొరికిపోయింది.. ఇక నందన చాప్టర్ క్లోజ్!

Photos

+5

ఉదయ బాను నిర్మాతగా.. ‘పంచనామా’ సిరీస్‌ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)