Breaking News

మళ్లీ ఐపీవో హవా..!

Published on Fri, 07/25/2025 - 05:25

ఓవైపు సెకండరీ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నప్పటికీ మరోపక్క ప్రైమరీ మార్కెట్లు సందడి చేస్తున్నాయి. వెరసి ఈ ఏడాది జనవరి–జూన్‌ మధ్య ఐపీవోల ద్వారా అన్‌లిస్టెడ్‌ కంపెనీలు రూ. 45,350 కోట్లు సమీకరించాయి. ఇది 45 శాతం వృద్ధికాగా.. మరో 118 కంపెనీలు సెబీకి దరఖాస్తు చేశాయి. ఈ బాటలో వచ్చే వారం 3 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్నాయి. తద్వారా రూ. 6,200 కోట్లు సమీకరించనున్నాయి. వివరాలు చూద్దాం..


న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌డీఎల్‌) పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 30న ప్రారంభంకానుంది. ఆగస్ట్‌ 1న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ధరల శ్రేణి ప్రకటించవలసి ఉంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 29న షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఇష్యూలో భాగంగా 5.01 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. 

వీటిని సంస్థలో ప్రధాన వాటాదారులైన స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈతోపాటు.. బ్యాంకింగ్‌ దిగ్గజాలు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీబీఐ, యూనియన్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సూటీ(ఎస్‌యూయూటీఐ) విక్రయానికి ఉంచనున్నాయి. వెరసి ఐపీవో నిధులు ప్రస్తుత వాటాదారుల సంస్థలకు చేరనున్నాయి. 2017లోనే ఐపీవోకు వచ్చిన సెంట్రల్‌ డిపాజిటరీ సరీ్వసెస్‌(సీడీఎస్‌ఎల్‌) ఇప్పటికే ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా డిపాజిటరీ సరీ్వసులందించే రెండో సంస్థగా ఎన్‌ఎస్‌డీఎల్‌ లిస్ట్‌కానుంది.  1996 నవంబర్‌లో డీమెటీరియలైజేషన్‌కు తెరతీయడంతో కంపెనీ డీమ్యాట్‌ సేవలలో భారీగా విస్తరించిన విషయం విదితమే. 2024–25లో కంపెనీ ఆదాయం 12% పైగా ఎగసి రూ. 1,535 కోట్లను తాకింది. నికర లాభం  25% జంప్‌చేసి రూ. 343 కోట్లకు చేరింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)