Breaking News

ర్యాన్సమ్‌వేర్‌ దాడి.. బ్యాంకింగ్‌ సేవల పునరుద్ధరణ

Published on Fri, 08/02/2024 - 09:18

హానికర సాఫ్ట్‌వేర్‌ (ర్యాన్సమ్‌వేర్‌) దాడికి గురైన సీ-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ సర్వీసులను తిరిగి పునరుద్ధరించినట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. దీనివల్ల దేశవ్యాప్తంగా సుమారు 300 సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల కస్టమర్లకు ఉపశమనం లభించింది.

ఎన్‌పీసీఐ తెలిపిన వివరాల ప్రకారం..దేశీయ బ్యాంకింగ్‌ సేవలందించే టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌ సీ-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌పై ఇటీవల ర్యాన్సమ్‌వేర్‌ దాడి జరిగింది. దాంతో వెంటనే స్పందించి దాడి జరిగిన సర్వర్‌ను డిస్‌కనెక్ట్‌ చేశారు. తిరిగి సర్వీస్‌ ప్రొవైడర్‌ సేవలను తాజాగా పునరుద్ధరించారు. వినియోగదార్లు ఏటీఎంల నుంచి నగదు స్వీకరణ, యూపీఐ లావాదేవీలు జరుపుకోవచ్చు.

ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్‌ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌వేర్‌ దాడి!

కస్టమర్లకు నిధుల బదలాయింపు, ఏటీఎంల వద్ద నగదు స్వీకరణ, యూపీఐ చెల్లింపు సేవల కోసం బ్యాంకులు సీ-ఎడ్జ్‌పై ఆధారపడ్డాయి. సీ-ఎడ్జ్‌ హానికర సాఫ్ట్‌వేర్‌ దాడికి గురికావడంతో లావాదేవీల విషయంలో కొన్ని సహకార, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వినియోగదార్లు సోమవారం నుంచి అంతరాయం ఎదుర్కొన్నారు. సీ-ఎడ్జ్‌లో ర్యాన్సమ్‌వేర్‌ విస్తరణకు అవకాశం ఉండడంతో పేమెంట్‌ సిస్టమ్‌లను వేరు చేసినట్టు ప్రకటించారు. అయితే ఈ దాడి కేవలం టెక్నాలజీ సిస్టమ్‌లకే పరిమితమైందని, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సొంత మౌలిక సదుపాయాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)