Breaking News

ఫోన్ పే, గూగుల్ పేకు గట్టి పోటీ.. సిద్దమవుతున్న భీమ్

Published on Mon, 08/12/2024 - 18:18

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తన భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్‌ను ఒక స్వతంత్ర అనుబంధ సంస్థగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బీహెచ్ఐఎమ్ (భీమ్) తన ఉనికిని విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. దీనికోసం లలితా నటరాజ్‌ను బీహెచ్ఐఎమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది.

లలితా నటరాజ్‌ గతంలో ఐడీఎఫ్‍సీ ఫస్ట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేశారు. కాబట్టి నటరాజన్ 'బీహెచ్ఐఎమ్'ను వేగంగా అభివృద్ధి చేస్తారని భావిస్తున్నారు. ఈ అభివృద్ధికి ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సహరిస్తున్నట్లు సమాచారం.  

భారతదేశంలో ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఈ యాప్‌ల మీద ప్రజలు ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం బీహెచ్ఐఎమ్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి ఆలోచిస్తోంది. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా 85 శాతం లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో ఈ రెండు కంపెనీల ఆధిపత్యం భవిష్యత్తులో ఆందోళన కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

బీహెచ్ఐఎమ్ అనేది 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ యాప్‌ని నేరుగా బ్యాంక్ చెల్లింపులు చేయడానికి లేదా యూపీఐ చెల్లింపులు చేయడానికి ఉపయోగించుకుపోవచ్చు. అయితే గూగుల్ పే, ఫోన్ పే వాడకంలోకి వచ్చిన తరువాత బీహెచ్ఐఎమ్ వినియోగం తగ్గిపోయింది. కాబట్టి దీనికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)