Breaking News

భారత్‌ కేంద్రంగా సీఎంఎఫ్‌.. నథింగ్‌ కీలక నిర్ణయం!

Published on Tue, 09/22/2026 - 19:35

స్మార్ట్‌ డివైజ్‌ల కంపెనీ నథింగ్‌ తమ అనుబంధ సంస్థ సీఎంఎఫ్‌ని విడదీసి పూర్తి స్థాయి స్టాండెలోన్‌ భారతీయ కంపెనీగా రిజిస్టర్‌ చేయనున్నట్లు వెల్లడించింది. ఇందులో మెజారిటీ షేర్‌హోల్డర్లు భారతీయులే ఉంటారని సంస్థ సీఈవో కార్ల్‌ పే వెల్లడించారు.

నథింగ్‌లో భాగమైన సీఎంఎఫ్‌ అందుబాటు ధరలో, మీడియం రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్లను తయారు చేస్తోంది. త్వరలో భారత్‌ ప్రధాన కేంద్రంగా ఈ కంపెనీ తన సొంత టీమ్, పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలు సాగిస్తుందని కార్ల్‌ తెలిపారు. ఇందులో నథింగ్‌ సంస్థ షేర్‌హోల్డరుగా, భాగస్వామిగా కొనసాగుతుందని వివరించారు. వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ని స్థాపించిన కార్ల్‌ .. ఆ తర్వాత దాన్నుంచి వైదొలిగి 2020లో నథింగ్‌ పేరిట స్మార్ట్‌ డివైజ్‌ల బ్రాండ్‌ను ఏర్పాటు చేశారు.

లండన్‌ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ ఏడాది క్రితం భారత్‌లో ఎల్రక్టానిక్స్‌ తయారీ సంస్థ ఆప్టీమస్‌ ఇన్‌ఫ్రాకామ్‌తో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసింది. ఇరు సంస్థలు 100 మిలియన్‌ డాలర్లపైగా (అప్పటి రూపాయి మారకం విలువ ప్రకారం సుమారు రూ. 887 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ప్రకటించాయి. 2028 నాటికి ఇది 1,800 ఉద్యోగాలు కల్పిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

#

Tags : 1

Videos

ఇవి ఏమైనా బ్యాంక్ అకౌంట్ లా.. అంబటి మాస్ ర్యాగింగ్...

క్రాంతి కుమార్ పై కుల వివక్ష! నా కొడుకు కేసులో సిట్ వేయరా!

బలమైన అభ్యర్థులను ఎంపిక చేయండి అని YS జగన్ చెప్పారు

అయ్య‌ప్ప మాల సాక్షిగా చెబుతున్నా... వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూట‌మి కొట్టుకుపోవ‌డం ప‌క్కా

CJP మరో డిమాండ్ CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి రంగం సిద్ధం.

స్టాక్ మార్కెట్ భారీ పతనం! ₹6 లక్షల కోట్లు ఆవిరి!

టీచర్లు అంటూ యువగళం టీమ్ బూతులు.. అనిత వ్యాఖ్యలకు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి

బండ బూతులు తిడుతూ..ఎలా కొట్టించిందంటే?

కొట్టుకుపోయిన కోస్తా.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు..

Photos

+5

హీరోయిన్ రాధ ఇంట గణనాథునికి ప్రత్యేక పూజలు.. ఫోటోలు

+5

బీచ్‌లో దేవకన్యలా హీరోయిన్ శ్రీలీల పోజులు.. ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో హీరోయిన్ శృతిహాసన్ గ్లామర్.. ఫోటోలు

+5

విశాఖలో భారీ వర్షం... నేలకొరిగిన చెట్లు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో ప్రిన్స్ పెళ్లి రిసెప్షన్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న .. నక్షత్ర (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నెక్లెస్ రోడ్డులో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు (ఫొటోలు)

+5

ఏష నాగుల కట్ట మీద.. వ‌ర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన కీర్తి సురేష్‌..(ఫొటోలు)

+5

ఏపీ : తీవ్ర వాయుగుండం...ఉత్తరాంధ్ర అతలాకుతలం (ఫొటోలు)

+5

వేడుకకు వేళాయే...రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర (ఫొటోలు)