Breaking News

‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ మనకు సెట్‌ కాదు.. ఆఫీస్‌కి వచ్చేయండి’

Published on Mon, 08/19/2024 - 21:45

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న తమ ఉద్యోగులందరూ ఆఫీస్‌కి వచ్చి పనిచేయాలని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ‘నథింగ్’ సీఈఓ కార్ల్ పీ ప్రకటించారు. కోవిడ్ నుంచి సంవత్సరాల తరబడి రిమోట్‌గా పనిచేస్తున్న లండన్‌ ఉద్యోగులు ఇక ఆఫీస్‌కు రావాలంటూ వారికి ఈమెయిల్స్‌ పంపించారు.

కంపెనీ భవిష్యత్తు వృద్ధికి, ఆవిష్కరణలకు ఆఫీసు నుంచి పని చేయడం చాలా కీలకమని కార్ల్‌ పీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన లింక్‌డిన్ ఖాతాలో పూర్తి ఈమెయిల్‌ను కూడా షేర్ చేశారు. "మనం తక్కువ సమయంలోనే చాలా దూరం వచ్చాం. పదేళ్లలో స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని స్థాపించి భారతదేశంలో 567 శాతం వార్షిక వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్. అయినప్పటికీ, మనం మన సామర్థ్యంలో 0.1% వద్దే ఉన్నాం" అంటూ రాసుకొచ్చారు.

రిమోట్ లేదా హైబ్రిడ్ విధానం చాలా కంపెనీలకు సరిపోయినప్పటికీ, ‘నథింగ్‌’కు సెట్‌ కాదని వివరించారు. ఇందుకు ఆయన మూడు ముఖ్యమైన కారణాలను పేర్కొన్నారు. భౌతిక ఉత్పత్తులను రూపొందించడంలో సన్నిహిత సహకారం అవసరం. బలమైన పోటీదారులను ఓడించడంలో సృజనాత్మకత, ఆవిష్కరణల ప్రాముఖ్యత. నవతరం టెక్ కంపెనీగా మారాలనే కంపెనీ ఆకాంక్ష అని వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)