Breaking News

మొండి బాకీలు గొడ్డలిపెట్టు

Published on Tue, 08/05/2025 - 10:11

భారత ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)లు అభివృద్ధి చెందాలంటే, స్థూల నిరర్థక ఆస్తులను (జీఎన్‌ పీఏ)లను తగ్గించాలి. ఆ దిశలో కొంత కృషి జరిగిన మాట నిజమే కానీ మరింత పకడ్బందీగా వ్యవహరించవలసి ఉంది. 2018 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా జీఎన్‌ పీఏ నిష్పత్తి 11.2 శాతానికి చేరింది. క్రమంగా తగ్గుతూ 2025 ఆర్థిక సంవత్సరంలో ఇది 2.58 శాతానికి వచ్చింది. బ్యాంకులు అనుసరిస్తున్న మెరుగైన రుణ మదింపు, కఠిన మైన నియంత్రణ పర్యవేక్షణతోటు దేశవ్యాప్తంగా తయారీ, సేవల రంగాల్లో వృద్ధి నమో దవుతుండటంతో ఈ పురోగతి సాధ్యమైంది. 

ప్రతిసారీ బ్యాలెన్స్‌ షీట్లను క్లియర్‌ చేయ డానికి రుణాల రైట్‌–ఆఫ్‌ బ్యాంకులకు ఒక సాధనమైంది. అయితే అధిక మొత్తంలో రుణ మాఫీలు సరికాదు. ఇవి జీఎన్‌ పీఏ గణాంకాలను తగ్గించి, మూలధన వినియోగాన్ని నియంత్రించేలా చేస్తాయి. కస్టమర్లు తీసుకున్న రుణాల్లో బలమైన రికవరీ (వసూలు) లేక పోతే బ్యాంకులు శాశ్వత నష్టాల్లో కూరుకుపో తాయి. దేశంలో నిరర్థక ఆస్తుల రికవరీ ఏటా 10 నుంచి 15% వరకు ఉంటోంది. దానికి తోడు ఏటా కొత్తగా ఎన్‌ పీఏలు చేరుతున్నాయి. ఇది బ్యాంకింగ్‌ వ్యవస్థకు గొడ్డలిపెట్టు.

ఆర్‌బీఐ డేటా ప్రకారం, రూ.1 లక్ష అంత కంటే ఎక్కువ పరిమాణంలోని ఆర్థిక మోసాల విలువ 2025 ఆర్థిక సంవత్సరంలో 36,013 కోట్లకు చేరింది. ఈ పెరుగుదల క్రెడిట్‌ అండర్‌ రైటింగ్‌ (అప్పు ఇచ్చే ముందు బ్యాంకులు పరి గణించే పరామితులు)లో లోపాలను ప్రతిబింబిస్తోంది. గతంలో కంటే మోసాల సంఖ్య తగ్గినా సగటు మోసం చేసే మొత్తం నగదు విలువ అధికంగా ఉంటోంది. 

ఇది వ్యవస్థాగత బలహీనతను సూచిస్తోంది. దీనికితోడు ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (విల్‌ఫుల్‌ డిఫాల్టర్లు) పెరుగుతున్నారు. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి భారతీయ బ్యాంకులు 1,629 ఉద్దేశపూర్వక ఎగవేతదారులను నివేదించాయి. వీరి మొత్తం రుణం రూ. 1.62 లక్షల కోట్లుగా తెలిపాయి. వీరిపై అనేక సంద ర్భాల్లో చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నా రికవరీ మందకొడిగా ఉంది. ఈ దీర్ఘకాలిక సమస్యను తగ్గించడానికి కఠిన చర్యలు అవసరం. 

రియల్‌ టైమ్‌ అనలిటిక్స్, ఏఐ ఆధారిత నిఘా, ఆడిట్‌ ఇంటిగ్రేషన్‌   ద్వారా పెద్దమొత్తంలో మోసాలను తగ్గించవచ్చు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును రికవరీ చేయడా నికి, భవిష్యత్తులో ఎగవేతలను నిరోధించడా నికి కఠిన చట్టాలు అవసరం. బ్యాంకుల కార్పొరేట్, ఎస్‌ఎంఈ విభాగాల్లో రుణాలు మంజూరు చేసేటపుడు మరింత పకడ్బందీ విధానాలు పాటించాలి.
   అల్లపురపు పవన్‌ కుమార్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)