Breaking News

గృహ రుణ మార్కెట్లో పీఎస్‌బీల దూకుడు 

Published on Sun, 11/23/2025 - 04:20

ముంబై: గృహ రుణ మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులు పెద్ద ఎత్తున కార్యకలాపాలను విస్తరిస్తున్న క్రమంలో.. నాన్‌ బ్యాంకింగ్‌ రుణ దాతల హౌసింగ్‌ పోర్ట్‌ఫోలియో వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానించొచ్చని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ తెలిపింది. నాన్‌ బ్యాంక్‌ రుణదాతల నిర్వహణలోని రుణ ఆస్తుల విలువ 2025–26లో 12–13 శాతం మేర వృద్ధి చెందొచ్చని.. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 14 శాతంగా ఉందని పేర్కొంది. 

బ్యాంకుల నుంచి తీవ్ర పోటీకి తోడు, ప్రీమియం గృహ రుణాల్లో ఆధిపత్యం రూపంలో సవాళ్లను బ్యాంకింగేతర గృహ రుణ సంస్థలు ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సంతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనూ ప్రీమియం గృహ రుణాల్లో హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలను ప్రభుత్వరంగ బ్యాంకులు అధిగమించించినట్టు తెలిపింది. బ్యాంకులు తక్కువ రేటుపై గృహ రుణాలను అందిస్తుండడం ధరల్లో పోటీకి దారితీసినట్టు పేర్కొంది. 

9 శాతంలోపు వడ్డీ రేట్లతో కూడిన గృహ రుణాల పోర్ట్‌ఫోలియో 2025 మార్చి 31 నాటికి 60 శాతానికి చేరుకుందని, గత ఆర్థిక సంవత్సరంలో ఇది 45 శాతంగానే ఉన్నట్టు వెల్లడించింది. బ్యాలన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (మిగిలిన గృహ రుణాన్ని బదిలీ చేసుకోవడం)తో కస్టమర్లు వెళ్లిపోతున్న ధోరణి నెలకొన్నట్టు క్రిసిల్‌ డైరెక్టర్‌ శుభశ్రీ నారాయణన్‌ తెలిపారు.ప్రభుత్వరంగ బ్యాంకులు అసాధారణ స్థాయిలో అతి తక్కువ రేట్లపై గృహ రుణాలను మంజూరు చేస్తుండడం పట్ల కొన్ని సంస్థలు ఇటీవలి కాలంలో ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.  

నిదానించిన వృద్ధి.. 
పెరుగుతున్న పట్టణీకరణ, ఇళ్ల ధరల కంటే, ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, ఆదాయపన్ను, జీఎస్‌టీ తగ్గింపు వంటి సానుకులతలు ఉన్నప్పటికీ.. గృహ రుణ మార్కెట్లో వృద్ధి నిదానించినట్టు క్రిసిల్‌ నివేదిక తెలిపింది. మొత్తం మీద 2025–26లో మోర్ట్‌గేజ్‌ ఏయూఎం వృద్ధి 18–19 శాతం స్థాయిలో ఉండొచ్చని, 2024–25లో 18.5 శాతంగా ఉన్నట్టు పేర్కొంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)