Breaking News

కొత్త నాయిస్ మాస్టర్ బడ్స్: దీని స్పెషాలిటీ ఏంటంటే..

Published on Thu, 03/06/2025 - 18:18

ఇయర్ బడ్స్ వినియోగం పెరిగిపోతున్న తరుణంలో.. నాయిస్ (Noice) కొత్త 'మాస్టర్ బడ్స్‌' (Master Buds) ప్రారంభించింది. ఇది సౌండ్ బై బోస్ టెక్నాలజీ కలిగిన వైర్‌లెస్ ఇయర్‌ బడ్‌.

మాస్టర్ సిరీస్‌లోని మొదటి ఉత్పత్తి అయితే ఈ ఇయర్ బడ్స్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. దీని డిజైన్.. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇయర్ బడ్స్ కంటే భిన్నంగా ఉంది. డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ, గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ మాస్టర్ బడ్స్ మంచి లిజనింగ్ అనుభూతిని అందిస్తుంది.

నాయిస్ మాస్టర్ బడ్స్ స్పేషియల్ ఆడియో సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. పీక్, టైటానియం వంటి అత్యుత్తమ మెటీరియల్‌లతో తయారైన ఈ బడ్స్.. 12.4 మిమీ డ్రైవర్‌లతో అమర్చబడి ఉంటాయి. హై-డెఫినిషన్ ఆడియోను మరింత పెంచడానికి, ఇయర్‌బడ్‌లు ఎల్‌హెచ్‌డీసీ (లో లేటెన్సీ హై డెఫినిషన్ ఆడియో కోడెక్) మద్దతుతో వస్తాయి.

సౌండ్ బై బోస్ టెక్నాలజీతో, నాయిస్ మాస్టర్ బడ్స్ అన్ని ఫ్రీక్వెన్సీలలో.. మంచి ఆడియోను అందించేలా తయారైంది. అంతే కాకుండా 49 డెసిబుల్స్ వరకు సౌండ్ ఐసోలేషన్‌ను అందించే నాయిస్ క్యాన్సిలేషన్‌ను పొందుతాయి. మ్యూజిక్, కాల్స్ వంటివి చాలా క్లారిటీగా వినిపిస్తాయి.

ఇదీ చదవండి: రెండు లక్షలమంది కొన్న కారు: ఇప్పుడు కొత్త ఎడిషన్‌లో..

సాఫ్ట్ టచ్ మెటీరియల్‌లతో తయారైన నాయిస్ మాస్టర్ ఇయర్‌బడ్స్.. చెవులపై ఒత్తిడిని కలిగించవు. ఇది మూడు పరిమాణాలలో అందుబాటులో ఉంటుంది. వీటిని మీరు జిమ్‌లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా రోజంతా ఉపయోగించవచ్చు. ఒక ఛార్జితో 40 గంటలు పనిచేసే దీని ధర రూ. 7999 కావడం గమనార్హం.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)