Breaking News

చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం ఇల్లీగల్!

Published on Thu, 09/17/2026 - 17:53

టాటా గ్రూప్‌లో నాయకత్వానికి సంబంధించిన వివాదం మరోసారి తారాస్థాయికి చేరుకుంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలన్న బోర్డు నిర్ణయం ఈ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ రోజు (సెప్టెంబర్ 17) ముంబైలో జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్ కొనసాగింపుపై ఓటింగ్ జరగగా, 4-1 మెజారిటీతో ఆయనకు అనుకూలంగా నిర్ణయం వచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా తీవ్రంగా వ్యతిరేకించారు.

నోయెల్ టాటా అసమ్మతి
చంద్రశేఖరన్ పునర్నియామకానికి తాను వ్యతిరేకంగా ఓటు వేసినట్లు నోయెల్ టాటా పేర్కొన్నారు. తనకు ఉన్న వీటో అధికారాన్ని ఒక లీగల్ ఒపీనియన్ ఆధారంగా పక్కన పెట్టారని, బోర్డు తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. తన అసమ్మతిని అధికారికంగా రికార్డు చేసినట్లు తెలిపారు.

అయితే.. బోర్డు తీసుకున్న నిర్ణయంతో చంద్రశేఖరన్ పదవీకాలం పూర్తిగా ఖరారైందని నిర్దారించలేము. ఎందుకంటే.. తరువాత దశలో వాటాదారుల ఆమోదం కూడా కీలకం. టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు దాదాపు 66 శాతం వాటా ఉండటంతో, ఏజీఎంలో ట్రస్ట్స్ వైఖరి చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. చంద్రశేఖరన్ డైరెక్టర్‌గా కొనసాగేందుకు అవసరమైన ఆమోదం లభిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన డైరెక్టర్‌గా కొనసాగకపోతే, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఆయన కొనసాగింపుపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

రెగ్యులేటరీ సమస్య
ఇదే సమయంలో.. టాటా సన్స్ మరో ముఖ్యమైన రెగ్యులేటరీ సమస్యను కూడా ఎదుర్కొంటోంది. టాటా సన్స్‌ను కోర్ ఇన్వెస్ట్‌‌మెంట్ కంపెనీగా పరిగణించే ఆర్బీఐ నియంత్రణ వ్యవస్థ నుంచి బయటకు రావాలన్న సంస్థ అభ్యర్థనను.. రిజర్వు బ్యాంక్ తిరస్కరించింది. దీంతో టాటా సన్స్‌పై వర్తించే అప్పర్ లేయర్ NBFC నిబంధనలు, ముఖ్యంగా లిస్టింగ్‌కు సంబంధించిన అంశం, మళ్లీ ప్రాధాన్యతలోకి వచ్చాయి. ఈ పరిణామం టాటా సన్స్ భవిష్యత్ వ్యూహంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

టాటా సన్స్ ఒక సాధారణ కంపెనీ కాదు. ఎందుకంటే.. టాటా గ్రూప్‌లోని అనేక కీలక సంస్థల్లో దాని వాటాలు ఉన్నాయి. అందువల్ల టాటా సన్స్‌లో నాయకత్వ మార్పు లేదా స్థిరత్వానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకుంటే.. ఆ ప్రభావము గ్రూప్‌లోని ఇతర కంపెనీలపై కూడా పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒకవైపు రెగ్యులేటరీ సవాళ్లు, మరోవైపు లిస్టింగ్ అంశం, ఇంకోవైపు నాయకత్వంపై అంతర్గత విభేదాలు ఉండటంతో ప్రస్తుత పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.

అందుకే ఆయనకు సపోర్ట్
చంద్రశేఖరన్ కొనసాగింపుకు బోర్డు మద్దతు ఇవ్వడం వెనుక.. సంస్థ ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్ల సమయంలో నాయకత్వంలో స్థిరత్వం అవసరమనే అభిప్రాయం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. నోయెల్ టాటా మాత్రం ఆయన పునర్నియామకాన్ని వ్యతిరేకిస్తూ, తన అధికారాలను పక్కన పెట్టి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు బోర్డు రూమ్‌ను దాటి ఇప్పుడు వాటాదారుల సమావేశం వరకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.

నిజానికి టాటా గ్రూప్‌లో ప్రస్తుతం జరుగుతున్న వివాదం.. కేవలం ఒక వ్యక్తి పదవీకాలం పొడిగింపుకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది టాటా సన్స్‌లో నాయకత్వం, టాటా ట్రస్ట్స్ ప్రభావం, బోర్డు అధికారాలు, వాటాదారుల హక్కులు, అలాగే రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంది. రాబోయే ఏజీఎంలో జరిగే పరిణామాలు ఈ వివాదానికి తదుపరి దిశను నిర్ణయించే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం మార్కెట్ వర్గాలు, టాటా గ్రూప్ వాటాదారులు, పరిశ్రమ వర్గాలు దృష్టి తదుపరి పరిణామాలపైనే ఉంది.

ఇదీ చదవండి: ఐదు నిమిషాల మీటింగ్.. టీమ్ మొత్తాన్ని తొలగించిన US కంపెనీ!

Videos

Audio Viral: టీడీపీ కార్యకర్తలకే పింఛన్లు

పృథ్వీ షా పెళ్లి క్యాన్సిల్ షాకిచ్చిన ప్రేయసి..

నిజామాబాద్ నగరంలో దారుణం

Kakinada: పెళ్లి బస్సును ఢీకొట్టిన ట్రక్కు బస్సు బోల్తా

సిగ్గుండాలి.. నీ కార్యకర్తకే న్యాయం చేయలేవా..? లాకప్ డెత్ కేసు పై మంద కృష్ణ మాదిగ

కరుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్ విజువల్స్

APలో ఉన్నది ఎల్ నినో కాదు.. ఎల్లో నినో ఎఫెక్ట్.. YS జగన్ కౌంటర్

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై విచారణ.. రంగంలోకి రెవెన్యూ అధికారులు

‘దేశ సేవకు మరింత శక్తి కలగాలి’.. ప్రధాని మోదీకి జగన్‌ విషెస్‌

రోహిత్ & వంశీ మధ్య బిగ్ ఫైట్ కెప్టెన్‌గా చరణ్..!

Photos

+5

పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)

+5

సందడిగా సమంత సీమంతం వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)