Breaking News

ముకేశ్‌ అంబానీ బాటలోనే.. 

Published on Wed, 09/27/2023 - 00:13

న్యూఢిల్లీ: బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ బాటలోనే ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తె జీతాలు తీసుకోకుండా బాధ్యతలు నిర్వహించనున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు, కమిటీ సమావేశాలలో పాలుపంచుకుంటున్నందుకు ఆకాశ్, ఈషా, అనంత్‌ ఫీజులు మాత్రమే పొందనున్నారు. అంతేకాకుండా నికర లాభాల నుంచి కమీషన్‌ అందుకోను న్నారు.ముకేశ్‌ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వాటాదారుల అనుమతి కోరుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా ఈ అంశాలను వెల్లడించింది. 66ఏళ్ల అంబానీ 2020–21 ఏడాది నుంచి ఎలాంటి జీతాన్ని అందుకోవడంలేదు. అయితే అంబానీ బంధువులు నిఖిల్, హిటల్‌ వేతనాలతోపాటు.. ఇతర అలవెన్సులు తదితరాలను పొందుతున్నారు. (వాహన స్క్రాపేజీ పాలసీ: కంపెనీలకు నితిన్‌ గడ్కరీ కీలక సూచనలు) 

నీతా అంబానీ తరహాలో 2014లో ముకేశ్‌ భార్య నీతా అంబానీ ఎంపిక తరహాలోనే కవలలు 31ఏళ్ల ఆకాశ్, ఈషా సహా 28ఏళ్ల అనంత్‌ను ఆర్‌ఐఎల్‌ బోర్డులో నియమించనున్నారు. 2022–23లో నీతా అంబానీ రూ. 6 లక్షల సిటింగ్‌ ఫీజు, రూ. 2 కోట్ల కమీషన్‌ అందుకున్నట్లు ఆర్‌ఐఎల్‌ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గత నెలలో నిర్వహించిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్‌ఐఎల్‌ బోర్డులోకి ముగ్గురునీ ఎంపిక చేశారు. అయితే ముకేశ్‌ ఆర్‌ఐఎల్‌ చైర్మన్, సీఈవోగా మరో ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించనున్నారు. తద్వారా తదుపరితరం నాయకులకు మార్గదర్శకత్వం వహించనున్నారు. కాగా.. ముకేశ్‌ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వీలుగా ఆర్‌ఐఎల్‌ పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా వాటాదారుల అనుమతి కోరుతోంది. (సీఈవో సంచలన వ్యాఖ్యలు: ఉద్యోగుల నెత్తిన పిడుగు)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)