Breaking News

‘ఎవరికి చెల్లింపులు చేసినా నాకు తెలుస్తుంది’

Published on Sat, 11/30/2024 - 09:14

తప్పుడు పద్ధతిలో కాంట్రాక్టులు పొందేందుకు ప్రభుత్వ అధికారులకు ఎలాంటి లంచాలు ఇవ్వలేదని అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషీందర్ సింగ్ అన్నారు. అదానీ ‍గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల ప్రకారం అంత పెద్దమొత్తంలో ఎవరికైనా నగదు చెల్లిస్తే చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ హోదాలో ఉన్న తనకు కచ్చితంగా తెలుస్తుందన్నారు. ఈమేరకు విలేకరుల సమావేశంలో ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు.

‘అదానీ గ్రూప్‌పై ఇటీవల వచ్చిన ఆరోపణల్లో వాస్తవాలు లేవు. గ్రూప్‌ అధికారులు కాంట్రాక్టులు పొందేందుకు ప్రభుత్వ అధికారులకు ఎలాంటి లంచాలు ఇవ్వలేదు. ఆరోపణల ప్రకారం అంత పెద్దమొత్తంలో నగదు చెల్లిస్తే చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ హోదాలో ఉన్న నాకు కచ్చితంగా సమాచారం ఉంటుంది. యూఎస్‌లో చేసిన ఆరోపణలు న్యాయపరమైన అధికారాన్ని ఉపయోగించడమే తప్పా ఇది గ్రూప్‌పై దాడి కాదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు నిబంధనల ప్రకారం సరైన విధంగా స్పందిస్తారు. ఆయా ఆరోపణలను సమర్థంగా తిప్పికొడుతారు. ప్రస్తుతం 30 నెలల రుణ వాయిదాలు తిరిగి చెల్లించే సామర్థ్యం అదానీ గ్రూప్‌ కలిగి ఉంది. ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా 12 నెలల కంటే ఎక్కువగానే రుణా వాయిదాలు చెల్లించే నగదును ముందుగానే సిద్ధంగా ఉంటుంది’ అని తెలిపారు.

ఇదీ చదవండి: పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలు

భారత్‌లో భారీ సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌లు పొందేందుకు  దాదాపు రూ.2,200 కోట్లు (సుమారు 265 మిలియన్‌ డాలర్లు) లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో ఇటీవల అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీతో పాటు మరో ఏడుగురిపై మోసం, లంచం, అవినీతి కేసులు నమోదయ్యాయి.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)