Breaking News

గుడ్లు సేకరించే రోబో: ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ

Published on Sat, 03/01/2025 - 11:54

ఆఫీసులో పనిచేసే రోబో గురించి వినుంటారు, రెస్టారెంట్లలో పనిచేసే రోబోలను గురించి వినుంటారు, ఆఖరికి ఇంట్లో పనిచేసే రోబోలను కూడా సినిమాల్లో చూసే ఉంటారు. కానీ.. గుడ్లను (Eggs) సేకరించే రోబోలను గురించి విన్నారా?, బహుశా ఇది వినడానికి కొత్తగా అనిపించినా.. ఇలాంటిది కూడా ఒకటుందని తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే దీనివల్ల బోలెడన్ని లాభాలున్నాయి మరి.

ఎన్ఐటీ కాలికట్ (NIT Calicut).. గుడ్లను సేకరించడానికి ఓ ప్రత్యేకమైన రోబోట్‌ను రూపొందించింది. దీనిపేరు 'అవిబోట్' (AVIBOT). ఇది కోళ్ల ఫారాలలో గుడ్లను పగిలిపోకుండా చాలా జాగ్రత్తగా సేకరిస్తుంది. కాబట్టి వర్కర్స్ అవసరం, ఖర్చు కూడా తగ్గుతుంది. కోళ్ల పరిశ్రమలు నిర్వహించేవారు.. గుడ్లను సేకరించడానికి ఇలాంటి రోబోట్స్ ఉపయోగించవచ్చు.

అవిబోట్ ఉపయోగాలు
➤సాధారణంగా ఎక్కడైనా గుడ్లను సేకరించడానికి మనుషులను ఉపయోగిస్తారు. కానీ ఈ అవిబోట్ స్వయంగా గుడ్లను సేకరిస్తుంది. కాబట్టి లేబర్ ఖర్చులు తగ్గుతాయి.

➤అవిబోట్ చాలా వేగంగా గుడ్లను సేకరిస్తుంది. ఉదాహరణకు మనుషులు రెండు గంటల్లో గుడ్లను కలెక్ట్ చేస్తే.. ఈ రోబోట్ ఒక గంటలో పని పూర్తి చేస్తుంది. దీంతో సమయం ఆదా అవుతుంది. యజమాని లేదా నిర్వాహకులు ఇతర ముఖ్యమైన పనులపై దృష్టిపెట్టవచ్చు.

➤రోబోట్ చాలా జాగ్రత్తగా గుడ్లను సేకరిస్తుంది. కాబట్టి పగిలిపోయే గుడ్ల సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల యజమాని లాభం పొందవచ్చు. అంతే కాకుండా గుడ్డు ఉత్పత్తి రేట్లకు సంబంధించిన డేటాను సేకరించడం, రైతుల కార్యకలాపాలను పర్యవేక్షించడం, మెరుగుపరచడం వంటి వాటిలో కూడా సహాయపడుతుంది.

ఇదీ చదవండి: ఉండగా మరమనిషి తోడుగా.. పనిమనిషి ఎందుకు దండగ!

#

Tags : 1

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు