Breaking News

భారత్ కోసం రెండు జపనీస్ బ్రాండ్ కార్లు

Published on Wed, 03/26/2025 - 19:02

ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటైన 'నిస్సాన్' (Nissan) మరో రెండు కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో ఒకటి 5 సీటర్, మరొకటి 7 సీటర్. వీటిని కంపెనీ 2026లో దేశీయ విఫణిలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

జపాన్‌లోని యోకోహామాలో ఇటీవల ముగిసిన గ్లోబల్ ప్రొడక్ట్ షోకేస్ ఈవెంట్‌లో నిస్సాన్ కంపెనీ భారతదేశం కోసం తీసుకురానున్న రెండు కొత్త ఉత్పత్తులను ప్రదర్శించింది. దీన్ని బట్టి చూస్తే.. ఇండియన్ మార్కెట్లో తన హవా కొనసాగించడానికి సంస్థ తయారవుతున్నట్లు తెలుస్తోంది.

నిస్సాన్ కంపెనీ ఈ రెండు కార్లను భారతదేశంలో అధికారికంగా 2026లో ప్రారంభించనుంది. ఇవి రెండూ.. ఇప్పుడున్న బ్రాండ్ మోడల్స్ కంటే భిన్నంగా.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే విధంగా ఉంటాయని తెలుస్తోంది. కాగా ఈ కార్లకు సంబంధించిన చాలా వివరాలు వెల్లడికావాల్సి ఉంది. అయితే వీటిని కంపెనీ ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం డిజైన్ చేస్తోంది, కాబట్టి ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయని తెలుస్తోంది.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో నిస్సాన్ కేవలం ఒక కారును (మాగ్నైట్) మాత్రమే విక్రయిస్తోంది. ఇది ప్రారంభం నుంచి 1.70 లక్షల కంటే ఎక్కువ సేల్స్ పొందింది. దీని ధర రూ. 6.14 లక్షల నుంచి రూ. 11.92 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. డిజైన్, ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయి. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)