Breaking News

ఒకే వాహనం.. 14 కెమెరాలు, 9 రాడార్లు, 6 సెన్సార్లు

Published on Tue, 03/11/2025 - 17:18

ప్రపంచం ఆటోమేషన్ వైపు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రధానంగా ఆటోమోటివ్‌ విభాగంలో ఈ ఆటోమేషన్‌ పాత్ర కీలకంగా మారింది. ప్రస్తుతం స్వయంచాలిత డ్రైవింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. దాంతో చాలా కంపెనీలు ఈ మేరకు కొత్త సాంకేతికతను వినియోగిస్తూ వాటిని పరీక్షిస్తున్నాయి. అందులో భాగంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల విభాగంలో జపాన్ ఆటోమోటివ్ దిగ్గజం నిస్సాన్ సంస్థ దూసుకుపోతోంది. ఇటీవల జపాన్‌లోని యోకోహమాలోని రద్దీగా ఉన్న వీధుల్లో అత్యాధునిక అటానమస్ వ్యవస్థ కలిగిన సెల్ఫ్‌ డ్రైవింగ్ కార్లను పరీక్షించింది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సెరెనా మినీవ్యాన్‌ను యోకోహమా వీధుల్లో పరుగు పెట్టించింది. ఈ వాహనంలో 14 కెమెరాలు, 9 రాడార్లు, 6 లైడార్ సెన్సార్లను వాడారు. ఇవి అధిక రద్దీ ఉంటే రోడ్లపై సులువుగా ప్రయాణించేందుకు దోహదం చేస్తాయని నిర్వాహకులు తెలిపారు. మెరుగైన అటానమస్‌ వ్యవస్థ ఉండడంతో స్వయంగా వేగ పరిమితులను నిర్ధారించుకుంటుందని చెప్పారు. ట్రాఫిక్‌ను, అడ్డంకులను తప్పించుకుంటు ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఒకేరోజు 27 శాతం కుప్పకూలిన బ్యాంకు స్టాక్‌..

జపాన్‌లో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్లు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రానున్న రోజుల్లో డ్రైవర్ల కొరత అధికమవుతుందని, అలాంటి వారికి కంపెనీ చేస్తున్న ఇలాంటి ఆవిష్కరణలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. సెరెనా ప్రస్తుతం లెవల్ 2 స్వయంప్రతిపత్తితో(అటానమీ వ్యవస్థ-పాక్షికంగా ఆపరేట్‌ చేయడానికి మానవుల అవసరం ఉండడం) పనిచేస్తుండగా.. 2029 నాటికి లెవల్ 4 స్వయంప్రతిపత్తి(మానవ ప్రయేయంలేని)ని సాధించాలని నిస్సాన్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)