Breaking News

నేనో ఇడియట్‌లా ఫీలయ్యా.. నిఖిల్ కామత్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్

Published on Sat, 02/15/2025 - 15:11

ఫిబ్రవరి 14న ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.. జెరోధా సహ వ్యవస్థాపకుడు 'నిఖిల్ కామత్' (Nikhil Kamath) ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు అని చెబుతూనే.. భారతదేశం బాగుంటుందని అన్నారు. ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

భారతదేశంలోని 25 ఏళ్లలోపు తెలివైన యువ వ్యాపారవేత్తలతో.. ఒకరోజు సమయం గడిపిన తరువాత నేను ఒక ఇడియట్ అని భావిస్తున్నాను. రోజంతా అనవసరమైన మీటింగులతో కాలక్షేపం చేయడం చాలా వృధా.. ఇలాంటి యువకులతో సమయం గడిపితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ తరం నా కంటే చాలా తెలివైనదని నిఖిల్ కామత్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతే కాకుండా.. ఇది కొత్త భారతదేశం, ఇలాంటి యువకులతో భారతదేశం బాగుంటుందని, చెబుతూ.. అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు" అని ఆయన అన్నారు.

నిఖిల్ కామత్ పోస్టుపై.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. భారతదేశం అభివృద్ధి చెందడానికి ఇంకెంతో సమయం లేదని ఒకరు.. యువతతో ఎక్కువ సమయం గడపడానికి.. వారిని ప్రోత్సహించడానికి సమయం కేటాయించాలని మరొకరు కామెంట్స్ చేశారు.

 ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్.. ఆలస్యమైతే డబుల్ ఛార్జ్

జెరోధా వృద్ధికి నితిన్ కామత్ తోడు
జెరోధా కంపెనీ వ్యాపార రంగంలో దూసుకెళ్తోంది. ఈ కంపెనీ అభివృద్ధి చెందటానికి.. నా సోదరుడు, జెరోధా కో-ఫౌండర్ నితిన్ కామత్ (Nithin Kamath) కూడా కారణం. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన విషయాలను నేను చూసుకుంటే.. బ్రోకింగ్ సంబంధిత పనులన్నీ కూడా నితిన్ చూసుకుంటాడు. మా మధ్య అప్పుడప్పుడు అభిప్రాయం బేధాలు వచ్చినా.. తరువాత సామరస్యంగా ముందుకు వెళ్తామని నిఖిల్ కామత్ పేర్కొన్నారు.

#

Tags : 1

Videos

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు