Breaking News

Layoffs 2023: వందలాది మందిని తొలగించనున్న మరో కంపెనీ.. 

Published on Mon, 12/25/2023 - 18:08

కొత్త సంవత్సరంపై కోటి ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు, ఉద్యోగార్థులకు కంపెనీలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం సుమారు వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే మరో అంతర్జాతీయ కంపెనీ వందలాది మందిని తొలగించనున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌కి భారీ షాక్‌! రూ.12 వేల కోట్ల డీల్‌ క్యాన్సిల్‌

గ్లోబల్ స్పోర్ట్స్ వేర్ దిగ్గజం నైక్.. వ్యయాలను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా వందలాది మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను వెల్లడించింది. ‘ది గార్డియన్’ నివేదికల ప్రకారం..  లేఆఫ్‌ల అమలు, కొన్ని సేవలలో ఆటోమేషన్‌ను పెంచడం ద్వారా 2 బిలియన్‌ డాలర్లు (రూ.16 వేల కోట్లకుపైగా ) ఆదా చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

గత సంవత్సరంలో అమ్మకాలలో తిరోగమనాన్ని ఎదుర్కొన్న నైక్, సంస్థాగత క్రమబద్ధీకరణ అవసరానికి అనుగుణంగా ఈ తొలగింపులు చేపడుతున్నట్లు వెల్లడించింది. తొలగిస్తున్న ఉద్యోగులకు చెల్లించే సీవరెన్స్‌‌ ప్యాకేజీల కోసం 450 మిలియన్‌ డాలర్లు ( సుమారు రూ.3,742 కోట్లు)ను కేటాయించునుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో 700 మంది ఉద్యోగుల తొలగింపు తర్వాత నైక్‌ చేపడుతున్న రెండో లేఆఫ్‌ ఇది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)