Breaking News

పేటీఎం ద్వారా ఫాస్టాగ్‌ టోల్‌ చెల్లిస్తున్నారా.. ఎన్‌హెచ్‌ఏఐ కీలక అప్‌డేట్‌

Published on Fri, 02/16/2024 - 13:34

పేటీఎంకు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. తాజాగా ఫాస్టాగ్‌ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌)ను తొలగించారు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) తరఫున టోల్‌ రుసుము వసూలు చేసే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ(ఐహెచ్‌ఎంసీఎల్‌) ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాము తెలిపిన బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌లు కొనుగోలు చేయాలని చెప్పింది.

ఐహెచ్‌ఎంసీఎల్‌ పేర్కొన్న జాబితా ఇదే..

  • ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్
  • అలహాబాద్ బ్యాంక్
  • ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
  • యాక్సిస్ బ్యాంక్
  • బ్యాంక్ ఆఫ్ బరోడా
  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
  • కెనరా బ్యాంక్
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • సిటీ యూనియన్ బ్యాంక్
  • కాస్మోస్ బ్యాంక్
  • ఈక్విటాస్‌ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
  • ఫెడరల్ బ్యాంక్
  • ఫినో పేమెంట్స్ బ్యాంక్
  • హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
  • ఐసిఐసిఐ బ్యాంక్
  • ఐడిబిఐ బ్యాంక్
  • ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్
  • ఇండియన్ బ్యాంక్
  • ఇండస్‌ఇండ్‌ బ్యాంక్
  • జె అండ్ కె బ్యాంక్
  • కర్ణాటక బ్యాంక్
  • కరూర్ వైశ్యా బ్యాంక్
  • కొటక్ మహీంద్రా బ్యాంక్
  • నాగ్‌పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్
  • సారస్వత్ బ్యాంక్
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • త్రిసూర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్
  • యుకో బ్యాంక్
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • యెస్ బ్యాంక్

ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు స్వీకరించవద్దని పీపీబీఎల్‌ను ఆర్‌బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఆయా ఖాతాల్లో ఇప్పటి వరకు ఉన్న నగదును మాత్రం గడువులోపు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.

ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనం కదులుతున్నపుడు నేరుగా టోల్ చెల్లింపులు చేయడానికి ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ పరికరం. దేశవ్యాప్తంగా 100కి పైగా రాష్ట్ర రహదారి టోల్ ప్లాజాలు సహా అన్ని జాతీయ రహదారి టోల్ ప్లాజాల్లో కలిపి 750కి పైగా టోల్‌లు పనిచేస్తున్నాయి.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)