Breaking News

ఆడిట్‌లో లోపాలు.. రూ.2 కోట్ల జరిమానా

Published on Wed, 12/25/2024 - 12:43

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్ (ZEEL) ఆడిట్‌లో లోపాలు జరిగినట్లు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA) గుర్తించింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆడిట్‌లో లోపాలకు కారణమైన డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్‌పీకి రూ.2 కోట్ల జరిమానా విధించింది. ఈ ఆడిట్‌లో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లపై చర్యలు తీసుకుంది.

2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల​కు సంబంధించి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్ ఆడిట్‌ పనులను డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్‌పీకి అప్పగించింది. సుమారు రూ.200 కోట్ల ఆడిట్‌(audit)లో అవకతవకలు జరిగినట్లు ఎన్ఎఫ్ఆర్ఏ గుర్తించింది. దాంతో డెలాయిట్ హాస్కిన్స్‌కు రూ.2 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ అనధికార లావాదేవీలను గుర్తించడం, వాటిని నివేదించడంలో ఆడిట్ సంస్థ విఫలమైందని ఎన్ఎఫ్ఆర్ఏ తెలిపింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సీఏలు ఏబీ జానీను రూ.10 లక్షలు జరిమానా(fine)తోసహా ఐదేళ్ల పాటు ఆడిట్ పనుల నుంచి నిషేధించగా, రాకేశ్ శర్మకు రూ.5 లక్షల జరిమానాతోపాటు మూడేళ్లు నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: కిరాణా దుకాణాలకు టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌

డెలాయిట్ హాస్కిన్స్ & సెల్స్ ఎల్ఎల్‌పీ అనేది ఎకనామిక్‌ వ్యవహారాలు నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ సేవల సంస్థ. ఇది ఆడిట్, కన్సల్టింగ్, ఫైనాన్షియల్ అడ్వైజరీ, రిస్క్ అడ్వైజరీ, టాక్స్ సేవలతో సహా విస్తృత శ్రేణి సేవలను అందిస్తోంది. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ సర్వీసులు అందిస్తోంది.

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)